ByGanesh
Fri 29th Mar 2024 06:13 PM
సౌత్ నుంచి దుకాణం సర్దేసి బాలీవుడ్ లో హీరోయిన్ గా పాతుకుపోదామని కలలు కన్న తాప్సి కి హిందీలో బాగానే వర్కౌట్ అయ్యింది. స్టార్ హీరోల ఛాన్స్ లు రాకపోయినా.. హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్ తో తన ప్రత్యేకతని చూపించింది. సౌత్ డైరెక్టర్స్ గ్లామర్ తప్ప నటనకు వాల్యూ ఇవ్వరని కామెంట్స్ చేసిన తాప్సి పన్ను హిందీలో ఆ గ్లామర్ చూపించే అక్కడ న్యూస్ లో నిలిచింది. కొన్నాళ్లుగా తాప్సి పన్ను డెన్మార్క్ బ్యాట్మింటన్ ప్లేయర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాప్సి తన బాయ్ ఫ్రెండ్ ని మార్చ్ 23 న రాజస్థాన్ లోను ఉదయ్ పూర్ లో సీక్రెట్ గా బంధుమిత్రుల నడుమ వివాహం చేసుకుంది అనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. బంధువులు, అత్యంత దగ్గరైన సన్నిహితుల నడుమ తాప్సి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అన్నారు. ఈ విషయమై తాప్సి మాత్రం పెదవి విప్పలేదు. అయితే ఆ న్యూస్ ఇంకా ప్రచారంలో ఉండగానే తాప్సి సోషల్ మీడియా వేదికగా.. Hope this romance with saree never ends….. ఈ సారీతో ఈ బంధం ఎప్పటికి ఇలానే ఉండాలని ఆశిస్తున్నట్టుగా చీర కట్టుకుని దానిపై బ్లాక్ కోట్ వేసుకుని ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది.
మరి పెళ్లి పై ఇంత పెద్ద ఎత్తున జరిగిన ప్రచారానికి తాప్సి ఎలాంటి అడ్డుకట్ట వెయ్యకుండా ఓ చీర కోసం పోస్ట్ చెయ్యడం విచిత్రమే అయినా.. తాప్సి తన పెళ్లి వార్తలని కొట్టిపారెయ్య్యడం చెయ్యలేదు అంటే..ఆమె నిజంగానే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది అని నెటిజెన్స్ కూడా ఫిక్సవుతున్నారు.
Taapsee First Post Amid Her Secret Wedding Rumours:
Taapsee Pannu latest post goes viral