Entertainment

tamil hero ajith given 1 35 crore cash to fight with covid


భారీ విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌.

సమాజం నుంచి  తీసుకోవడమే కాదు, ఆ సమాజానికి ఏదైనా కష్టం వస్తే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి అనేది ఇప్పుడు మన సెలబ్రిటీలు కొంతమంది పాటిస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. ఇందుకోసం టాలీవుడ్ సినీ నటులు కరోనా క్రైసెస్ ఛారిటీని ఏర్పాటు చేసి తమ వంతు సాయాన్ని ఛారిటీ ద్వారా అందిస్తున్నారు. 

తమిళనటీనటులు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాయం చేస్తున్నారు. తాజాగా తమిళ అగ్ర నటుడు అజిత్ తన వంతుగా రూ. 1 కోటి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అందులో ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి  25 లక్షల రూపాయ‌ల విరాళాన్ని  ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. అజిత్ త‌న త‌దుప‌రి చిత్రం వాలిమై చిత్రీక‌ర‌ణ క‌రోనా కార‌ణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది.

Topics:

 



Source link

Related posts

ఆ ప్రదేశంలో పాయల్ ముద్దులాట, పబ్లిక్‌గా అందరూ చూస్తుండగానే!! నెట్టింట వైరల్ పిక్స్

Oknews

కళ్ళు చెదిరేలా 'స్కంద' బిజినెస్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Oknews

ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తున్న టాలీవుడ్‌.. వెలవెలబోతున్న బాలీవుడ్‌!

Oknews

Leave a Comment