Latest NewsTelangana

Telangana CM Revanth Reddy reviews Dharani Portal at Secretariat


Revanth Reddy reviews Dharani Portal at Secretariat: హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధరణి వెబ్‌సైట్ (Dharani Portal) సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం (ఫిబ్రవరి 24న) సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణిలో లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చింది. 

మార్చి మొదటివారం నుంచి ధరణి సమస్యలు పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో ఏకంగా 2.45 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలో లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డికి ధరణి కమిటీ నివేదిక సమర్పించింది. దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తుది నివేదిక అందిన తర్వాత ధరణిలో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటాం అన్నారు. 

Revanth Reddy: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, భూ సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం

2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవిన్యూ రికార్డుల నవీకరణతో నే కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లింది.

వెయ్యి రూపాయల ఫీజు రైతులకు భారం.. 
లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు.

తుది నివేదిక ఆధారంగా సమస్యల పరిష్కారం.. 
కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూముల రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేయటం లేదా.. కొత్త చట్టం తీసుకు వచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సూచించారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని సీఎం అన్నారు. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని కమిటీని కోరారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పుడున్న పెండింగ్ దరఖాస్తుల్లో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఏజెన్సీపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు.. 
ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటాను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ దగ్గర ఉంచటాన్ని ముఖ్యమంత్రి తప్పు బట్టారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా.. సురక్షితంగా ఉన్నట్టా.. లేనట్టా.. అని అనుమానాలు వ్యక్తం చేశారు. 2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్​మెంట్​ ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు. ఆ కంపెనీ దివాళా తీసిందని, తర్వాత టెర్రాసిస్ అని పేరు మారటం, డైరెక్టర్లు అందరూ మారిపోవటం, తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీగా చేతులు మారటంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

బిడ్ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా.. అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు. మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున.. విలువైన భూములను పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా.. అని సీఎం రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

‘జితేందర్‌ రెడ్డి’ మూవీ గ్లింప్స్‌ రిలీజ్‌

Oknews

Aishwarya Rajinikanth being alone safe ఒంటరితనమే బాగుంది: ధనుష్ మాజీ వైఫ్

Oknews

Telangana Deputy Cm Bhatti Vikramarka Says Will Discuss Nandi Awards Issue In Telangana Cabinet

Oknews

Leave a Comment