తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ (టీఆర్‌టీ) – 2023 పరీక్షలు వాయిదాపడ్డాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా పరీక్షలను వాయిదావేసినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ దేవసేన అక్టోబరు 13న ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే వాయిదాపడిన పరీక్షల కొత్త షెడ్యూలు వెల్లడించనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. తాజాగా డీఎస్సీ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి.