Telangana Government Ordered to Ias Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్ గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్ గా రాజర్నిషా, కుమురం భీ ఆసిఫాబాద్ కలెక్టర్ గా స్నేహ శబరీష్, హైదరాబాద్ అదనపు కలెక్టర్ గా హేమంత కేశవ పాటిల్ ను బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా బీ.హెచ్.సహదేవరావును నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పర్సా రాంబాబు, హనుమకొండ అదనపు కలెక్టర్ గా ఎ.వెంకట్ రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్ గా బీఎస్.లత, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ గా డి.వేణుగోపాల్, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గా సీహెచ్ మహేందర్ బదిలీ అయ్యారు.
Also Read: Kavitha Case: కవిత కేసు మార్చి 13కి వాయిదా – సమయం లేదని విచారణ చేపట్టని సుప్రీంకోర్టు !
మరిన్ని చూడండి