Latest NewsTelangana

telangana govt approved another 60 posts in group1 cadre details here


TSPSC Group-1 Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విడుదల చేసిన 503 గ్రూప్-1 నోటిఫికేషన్‌కు అదనంగా మ‌రో 60 పోస్టులను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరినట్లయింది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ వెలువడనుంది. గ‌తంలో 503 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ పోస్టుల‌కు అద‌నంగా ఈ 60 పోస్టుల‌ను క‌లుపుతూ వీలైనంత త్వర‌గా నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ గ‌తేడాది జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఈ ప‌రీక్షను ర‌ద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా కొత్త‌గా 60 పోస్టుల‌ను మంజూరు చేయ‌డంతో గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ మ‌ళ్లీ నిర్వహించే అవ‌కాశం ఉంది.

TSPSC Group1: 'గ్రూప్-1'లో మ‌రో 60 పోస్టులు, భ‌ర్తీకి అనుమ‌తించిన ప్రభుత్వంTSPSC Group1: 'గ్రూప్-1'లో మ‌రో 60 పోస్టులు, భ‌ర్తీకి అనుమ‌తించిన ప్రభుత్వం

TSPSC Group1: 'గ్రూప్-1'లో మ‌రో 60 పోస్టులు, భ‌ర్తీకి అనుమ‌తించిన ప్రభుత్వం

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి… 

మరిన్ని చూడండి



Source link

Related posts

Housing Loan Home Loan Latest Interest Rates In Various Banks 2024 Check Here

Oknews

Heated Debate in Telangana Assembly Criticism of Congress and BRS

Oknews

BRS Kavitha Arrest Live News : లిక్కర్ కేసులో కవిత అరెస్ట్

Oknews

Leave a Comment