Latest NewsTelangana

telangana govt approved to fill 5348 posts in the health department check details here


Telangana Govt Jobs: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 5,348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పబ్లిక్ హెల్త్, ఆయుష్, డ్రగ్ కంట్రోల్, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించారు. 

రాష్ట్రంలోని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన క్రమంలో.. వాటిలో బోధనా సిబ్బందిని నియమించేందుకు వైద్యారోగ్య సిద్ధమైంది. మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఇలా అన్ని కలిపి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతకు సంబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాలని చెప్పారు. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చి నేరుగా ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు.

మొత్తం ఖాళీల్లో హెడ్ ఆఫ్ డిపార్ట్ మెంట్‌లో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 1255 పోస్టులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ లో 11, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిక్ మెడిసిన్‌లో34 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కాగా, వైద్యశాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. 

ALSO READ:

సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
సింగరేణిలో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. గతనెలలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఇటీవల అంతర్గత అభ్యర్థుల ద్వారా ఖాళీల భర్తీకి సింగరేణి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఇక తాజాగా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మరో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి పేపరు ప్రకటన మాత్రమే అధికారులు విడుదల చేశారు. అర్హతలు, పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఈఅండ్‌ఎం, సిస్టమ్స్)-49 పోస్టులు, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ-100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్, ఎలక్ట్రికల్)-33 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1లో 47 పోస్టులు, ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీలో 98 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 4న సాయంత్రం 45 గంటల్లోపు  ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చని సింగరేణి యాజమాన్యం సూచించింది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి



Source link

Related posts

టీఎస్పీఎస్సీ సభ్యుల్లో స్థానికేతర వ్యక్తి, చర్చకు తెరలేపిన ప్రభుత్వ నిర్ణయం!-hyderabad news in telugu criticism on tspsc new board appointments ,తెలంగాణ న్యూస్

Oknews

అప్పుడు 'డ్రైవర్ రాముడు'.. ఇప్పుడు 'ధీర'..!

Oknews

Kavitha held a dharna to cancel the existence of the third number GO | MLC Kavitha : జీవో నెంబర్ 3 రద్దు చేయాల్సిందే

Oknews

Leave a Comment