Latest NewsTelangana

Telangana govt declares holiday on february 8th for shab e meraj 2024 | Telangana News: రేపు గవర్నమెంట్ ఆఫీస్‌లకు, స్కూళ్లకు సెలవులు


Holidays in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీన షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది. ఇంతకుముందు, ఆప్షన్ హాలిడే గా ఉన్న దీనిని  ఇప్పుడు సాధారణ సెలవుగా మార్చింది. షబ్-ఎ-మెరాజ్ ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.

దీంతో, ఫిబ్రవరి 8న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటింస్తూ జీవో కూడా విడుదల చేసింది. ప్రక‌ట‌న విడుద‌ల కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు దినం కానుంది. అలాగే ఏపీలో ఫిబ్రవ‌రి 8న స్కూళ్లు, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెలవు ఇచ్చే అవ‌కాశం ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రక‌ట‌న చేయ‌లేదు.

తెలంగాణలో ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయింతి సందర్భంగా హాలీడే ఉండనుంది. ఏప్రిల్ 9 ఉగాది సెలవు.. ఏప్రిల్ 11,12న రంజాన్ సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవు ఉంటుంది. ఏప్రిల్ 17 శ్రీరామనవమికి కూడా సెలవు ప్రకటించారు.

జూన్ 17 బక్రీద్, జులై 17న మెహర్రం, జులై 29న బోనాల సందర్భంగా సెలవులు ఇచ్చారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్ 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవులు ఇచ్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి హాలీడే ఉంది. సెప్టెంబర్ 16 ఇద్ నబీకి సెలవు, అక్టోబర్ 2న మహత్మ గాంధీ జయంతి సందర్బంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 31 దీపావళి సెలవు ఉంది. నవంబర్ 15 గురునానక్ జయంతి సందర్భంగా సెలవు ఉంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవు ఉంది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Premalu OTT Streaming Date Fix ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Oknews

Rythu Bandhu Scheme : 5 ఎకరాల వరకే రైతుబంధు..! మారనున్న డబ్బుల జమ విధానం..? తాజా అప్డేట్స్ ఇవే

Oknews

సైలెంట్ గా వచ్చేసిన సత్యభామ.. ఏం చేస్తుందో..!

Oknews

Leave a Comment