తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష ఫలితాలు సెప్టెంబరు 27న ఉదయం 10 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ ఫలితాలకు సంబంధించి పేపర్-1లో 36.89 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా.. పేపర్-2లో 15.30 శాతం అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ విభాగంలో 18.66 శాతం, సోషల్ స్టడీస్ విభాగంలో 11.47 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలతోపాటు సబ్జెక్టులవారీగా తుది ఆన్సర్ ‘కీ’ని కూడా అధికారులు విడుదల చేశారు.
టెట్-2023 ఫలితాలు, తుది ఫైనల్ ‘కీ’ కోసం క్లిక్ చేయండి..
గతేడాది జూన్‌లో నిర్వహించిన టెట్ పేపర్-1లో 32.68 శాతం, పేపర్-2లో 49.64 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 2016, మే నెలలో నిర్వహించిన టెట్‌లో పేపర్-1లో 54.45 శాతం, పేపర్-2లో 25.04 శాతం, 2017, జులై నెలలో నిర్వహించిన టెట్ పేపర్-1లో 57.37 శాతం, పేపర్-2లో 19.51 శాతం ఉత్తీర్ణత సాధించారు.
సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్-1 పరీక్షకు 2.26 లక్షల మంది, పేపర్-2 పరీక్షకు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. సెప్టెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) నిర్వహించనున్నారు.
ALSO READ:
రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్ 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..