ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో అనసూయ పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కొందరు వ్యక్తులు శృతిమించుతూ చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించపోతే సహనానికి అర్థం ఉండదని అనసూయ ట్వీట్ చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు తాను సిగ్గు పడడం లేదని సరైన వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ట్వీటర్‌లో పేర్కొన్నారు. తన ఫిర్యాదు స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు. ఆకతాయి వాడిని ఐపీ ని గుర్తించిన పోలీసులు అతనిని పట్టుకునే పనిలో ఉన్నారు.
Topics: