Latest NewsTelangana

Telugu News From Andhra Pradesh Telangana Today 19 January 2024


Telugu News Today: ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలో కదలిక- రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలో కదలిక వచ్చింది. దీనిపై అధ్యయనంతోపాటు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకునేందుకు కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. దీనికి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ లీడ్ చేయనున్నారు. రాజీవ్‌ గౌబా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం అందులో పలు కీలకమైన శాఖలకు స్థానం కల్పించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజిన శాఖ కార్యదర్శులను భాగం చేసింది. వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించనున్న సీఎం జగన్
బెజవాడ స్వరాజ్ మైదానం(Swaraj Maidanam)లో నిర్మిస్తున్న భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ విగ్రహం దేశంలోనే అతి పెద్ద విగ్రహంగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ విగ్రహం 206 అడుగుల ఉందని ఇందులో 81 అడుగులు బేస్‌ ఉంటే, 125 అడుగులు విగ్రహం ఉందని తెలిపింది. రాత్రి వేళలో ఈ విగ్రహం కనిపించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ప్రత్యర్థులకు చెక్ పెడుతూనే పాలనలో తన మార్క్ చూపిస్తున్నారా?
రేవంత్ రెడ్డి  సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ దృష్టి సారిస్తూనే రాజకీయంగా బీఆర్ఎస్ నేతలకు చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దెబ్బకు దెబ్బ అన్న రీతిలో  రేవంత్ రెడ్డి నిర్ణయాలు సాగుతున్నాయి. ఈ నెల రోజుల్లోనే ఎన్నో కీలకమైన విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాలనా విషయాల్లోను, రాజకీయ పరమైన అంశాల్లోను దూకుడుగానే సాగుతున్నారు. మరి కొన్ని విషయాల్లో రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

జనవరి 21న బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల- మొదటి టాస్క్ ఏంటీ
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ…రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ (Telangana)లో మొన్నటి వరకు సొంత పార్టీ నడిపిన షర్మిల (Sharmila)…వైఎస్సాఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో…కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించింది పార్టీ అధిష్ఠానం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

సెన్సేషనల్‌ కామెంట్స్‌కి కేరాఫ్‌గా మారిపోతున్న కడియం శ్రీహరి
30 సంవత్సరాలుగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు కడియం శ్రీహరి(Kadiam Srihari ). మచ్చలేని రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న ఆయన ఒక్కసారిగా స్వరాన్ని మార్చారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు, సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కడియం శ్రీహరి. వివాద రహితుడిగా, మచ్చలేని నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తరువాత సెన్షేషనల్ కామెంట్స్ చేస్తూ దూమరం రేపుతున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



Source link

Related posts

నిజామాబాద్‌ కేంద్రీయ విద్యాలయ నూతన భవనం, వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ-nizamabad news in telugu kendriya vidyalaya new building pm modi started virtually ,తెలంగాణ న్యూస్

Oknews

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ తనిఖీల కలకలం-it inspections in 100 areas simultaneously in hyderabad ,తెలంగాణ న్యూస్

Oknews

జగన్ డైలాగ్ కాపీ కొట్టిన BRS MLA పాడికౌశిక్ రెడ్డి.!

Oknews

Leave a Comment