Latest NewsTelangana

Telugu News From Andhra Pradesh Telangana Today 20 January 2024


Telugu News Today: దారి తప్పిన చంద్రబాబు హెలికాఫ్టర్ – తర్వాత ఏం జరిగిందంటే ?
చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారి తప్పింది. అరకు నియోజకవర్గంలో రా కదలిరా బహిరంగసభకు  హాజరయ్యేందుకు  చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైలట్ రూట్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఏటీసీ సూచనలు అర్థం చేసుకోలేకపోవడంతో సమస్య ఏర్పడింది. రాంగ్ రూట్‌లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్ కరెక్ట్ రూట్‌లో అరుకులో ల్యాండ్ చేయగలిగారు. దీంతో కాసేపు ఉత్కంఠ ఏర్పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

ఐదో జాబితాపై సీఎం జగన్ కసరత్తు-సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో పెరిగిపోతున్న టెన్షన్
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy ) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections )గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నాలుగు జాబితాలను రిలీజ్ చేసిన జగన్…ఐదో జాబితాపై కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా తాడేపల్లికి ఎమ్మెల్యేలను పిలుపించుకొని మాట్లాడుతున్నారు. టికెట్ ఇవ్వని నేతలకు సర్దిచెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వడంలో వివరిస్తున్నారు. పార్టీ కోసం పని చేయాలని, భవిష్యత్ లో మంచి అవకాశాలు కల్పిస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఎవరూ కరెంటు బిల్లులు కట్టొద్దు- తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు!
లండన్‌లో  కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం.. కానీ వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి లాంటి అహంకారులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో అనేక మందిని చూసిందని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

అయోధ్య ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు ఎవరెవరంటే ? 
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవాని సంబంధించిన క్రతువులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. 22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమం నిర్వహణ మొత్తం లక్ష్మీకాంత్ దీక్షితులు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను అయోధ్య ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్నిరంగాల ప్రముఖులు హాజరుకానున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

కెసిఆర్‌కు కలిసి రాని అంబేద్కర్ విగ్రహం జగన్‌కు కలసి వస్తుందా ? దళితులు ఆకాంక్షల్ని గుర్తించలేకపోతున్నారా?
భారత రాజ్యాంగ నిర్మాత డా.BR అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడ లో ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. 125 అడుగుల ఈ భారీ విగ్రహం దేశం లోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం గా రికార్డుల కెక్కింది. తెలంగాణ లో కూడా 125 అడుగుల ఎత్తున్న విగ్రహం ఉన్నా దాని బేస్ 50 అడుగులు ఉంటే ఏపీ విగ్రహం బేస్ 81 అడుగులు. దేశ ప్రజలందరికీ గౌరవనీయుడైన అంబేద్కర్ ను దళితులు తమ ఆత్మ గౌరవ ప్రతీకగా చూస్తుంటారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



Source link

Related posts

Medaram Maha Jatara : మేడారం మహాజాతరకు అంతా రెడీ- ముఖ్యమైన ఘట్టాలివే!

Oknews

పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ కి జ్ఞానోదయం.. తండ్రి కొడుకులు వెల్లడి

Oknews

Gold Silver Prices Today 27 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: పసిడి ప్రకోపం

Oknews

Leave a Comment