Latest NewsTelangana

Telugu News Today From Andhra Pradesh Telangana 25 February 2024


Telugu News Today: వాళ్లంతా సమన్వయకర్తలే, అభ్యర్థులుగా ఫిక్స్ కాదు – వైవీ సుబ్బారెడ్డి ట్విస్ట్, ఇదో కొత్త స్ట్రాటజీనా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఏడు జాబితాలో ప్రకటించిన అభ్యర్థులంతా సమన్వయకర్తలేనని, వారే వచ్చే ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు కాదని వై వి సుబ్బారెడ్డి మరోమారు స్పష్టం చేశారు.  వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఏడు జాబితాల్లో ప్రకటించిన వారు సమన్వయకర్తలేనని, వాళ్లు అభ్యర్థులు కారని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

పవన్‌కల్యాణ్‌పై మూకుమ్మడి దాడి – జనసేనకు తక్కువ సీట్లు ఇస్తే వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బంది ఎందుకు ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీ పొత్తులోకి వస్తే ఏ సీట్లు కేటాయించాలన్నదానిపైనా ఓ నిర్ణయానికి వచ్చారు జనసేన పార్టీకి 24 అసెంబ్లీ , మూడు పార్లమెంట్ సీట్లను కేటాయించారు. పట్టుదలకు పోయి ఎక్కువ సీట్లలో పోటీ  చేయడం కన్నా… ఖచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి. గన్నవరం మండలంలోని ముంగండ అనే గ్రామానికి వచ్చారు. గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఆలయ విగ్రహ పున:ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆమె ఆలయానికి వచ్చారు. కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె తమ గ్రామానికి రావడంతో గ్రామస్థులంతా ఆనందం వ్యక్తం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

వారసుల కోసం కాంగ్రెస్ సీనియర్ల ఆరాటం – ఒత్తిడికి హైకమాండ్ తలొగ్గుతందా ? 
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపు ఉందని గట్టిగా నమ్ముతున్నారు. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి స్థిరపడేలా చేయడానికి ఇంత కంటే మంచి సమయం ఉండదని అనుకుంటున్నారు. సీనియర్ నేతలంతా.. లోక్ సభ ఎన్నికల్లో తమ వారసులకు లేకపోతే కుటుంబసభ్యులకు టిక్కెట్లు ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి, ట్విస్ట్ ఏంటంటే! 
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ యూనియన్ లీడర్ కె. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులను రద్దు చేసింది. మరోవైపు అధికారుల బదిలీలు సైతం కొనసాగుతున్నాయి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి



Source link

Related posts

Devara Part 1 Gets a New Release Date ఇదేం ట్విస్ట్ దేవరా

Oknews

ఖైదీ నంబర్‌ 6106.. దర్శన్‌ అభిమానులకు ఇది పద్మశ్రీ కంటే ఎక్కువా?

Oknews

ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

Leave a Comment