Andhra Pradesh

Tirumala : తిరుమలలో ఉగాది ఆస్థానం


ఏప్రిల్ 2వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఏప్రిల్‌ 2న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని(Koil Alwar Thirumanjanam) అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆల‌యాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.



Source link

Related posts

YSRCP Incharges 7th List : ఆగని వైసీపీ కసరత్తు… ఇంఛార్జుల 7వ జాబితా విడుదల – తాజా మార్పులివే

Oknews

Godavari Express Golden Jubilee: గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు యాభై ఏళ్లు.. గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు

Oknews

CM Jagan : నేరుగా తలపడే దమ్ము లేకే దిల్లీలో పొత్తులు- చంద్రబాబు, పవన్ పై సీఎం జగన్ పంచులు

Oknews

Leave a Comment