Andhra Pradesh

Tirumala : తిరుమలలో ఉగాది ఆస్థానం


ఏప్రిల్ 2వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఏప్రిల్‌ 2న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని(Koil Alwar Thirumanjanam) అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆల‌యాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.



Source link

Related posts

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ-srisailam news in telugu apsrtc running special buses to mallanna temple on shivaratri ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

YS Sharmila : B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్

Oknews

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈసారి ముందుగానే వేసవి సెలవులు!-amaravati ap school summer holidays start from april 24 to end june 13th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment