Top 10 Headlines Today
తెలంగాణలో బీజేపీ ప్లాన్ ఏంటీ?
తెలంగాణలో హంగ్ ఖాయం బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అని బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు చెప్పారు. హంగ్ వస్తే బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే.. కూటమిలో భాగం అవడం ద్వారా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఎన్నికలకు ముందు పొత్తులుంటాయా.. ఎన్నికల తర్వాతనా అనే దానిపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఎన్డీఏలోకి చంద్రబాబు చేరుతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెబుతూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. చివరికి బీజేపీతో పొత్తులకు సమయం మించిపోయిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వాయిదాల వ్యూహమేంటీ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో వ్యూహం మార్చారు. దసరాకు విశాఖకు రావడం లేదని ఇన్ఫోసిస్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో చెప్పారు. డిసెంబర్ కల్లా వస్తానన్నారు. నిజానికి విశాఖ జగన్ పాలన విషయంపై నాలుగేళ్లుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లు పెట్టినప్పటి నుండి సీఎం జగన్ ఎప్పుడైనా విశాఖ రావొచ్చని వైసపీ నేతలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్లు ఈ దసరా కాకపోతే.. వచ్చే సంక్రాంతికి అని చెబుతూ వచ్చారు. అయితే ఏదీ నిజం కాలేదు. ఈ దసరాకు ఆయన మారడం ఖచ్చితం అనుకున్నారు. ఎందుకంటే రుషికొండపై ముచ్చటపడి కట్టించుకున్న క్యాంప్ ఆఫీస్ దాదాపుగా పూర్తయింది. ఎన్నికలకు ఇంకా ఎంతో కాలం సమయం లేదు. అందుకే.. క్యాంప్ ఆఫీస్ విశాఖకు తరలిస్తారని అనుకున్నారు. కానీ మళ్లీ డిసెంబర్ లోపు అని సీఎం జగన్ వాయిదా వేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పసికూనల విజయం
ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. అది అలాంటి ఇలాంటి సంచలన కాదు. వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. రెండు విజయాలతో ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయిన ప్రొటీస్‌ను వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన నెదర్లాండ్స్ మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణించిన డచ్ జట్టు… బాల్‌తో అద్భుతం చేసింది. మొదట అనుకున్న దానికంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ జట్టు ముందుంచిన నెదర్లాండ్స్… సఫారీ జట్టు బ్యాటర్లను ఏ దశలోనూ క్రీజులో కుదురుకోనివ్వలేదు. వర్షం వల్ల 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అనంతరం 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 207 పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి ఈ ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. సమష్టిగా రాణించిన నెదర్లాండ్స్ బౌలర్లు ప్రొటీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రోజా క్షమాపణకు డిమాండ్
మంత్రి రోజాపై బుడబుక్కల సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బేషరత్తుగా రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సామజిక వర్గం నేతలు మంత్రి రోజాపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ బుడబుక్కల సంఘం నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బుడబుక్కల సంఘం అధ్యక్షుడు సత్యం డిమాండ్ చేశారు. మంత్రి రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరాంపై కేసు
గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆమె స్నేహితుడు శివరాంను పోలీసులు నిందితుడిగా చేర్చారు. పెళ్లి చేసుకుంటానని శివరాం నమ్మించి మోసం చేయడంతోనే ప్రవళ్లిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
రాజమహేంద్రవరం జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య నివేదిక అందజేయాలని ఆయన తరుపున నాగరాజు విజయవాడ ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. చంద్రబాబు లాయర్ల పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మనసులో మాట
కాంగ్రెస్ పార్టీలో సీఎం సీటు ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీఎం కుర్చీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తన మనసులోని ఆశను, అభిప్రాయాన్ని బయటపెట్టారు. ప్రజల హృదయాల్లో తాను సీఎం కావాలని ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపొడులో బీఆర్ఎస్ చెందిన జెడ్పీటీసీ గాలి సరిత రవి కుమార్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ.. తనకు తానుగా ఏనాడు, ఏ పదవీ కోరుకోలేదన్నారు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమోనని అన్నారు. ఏ పదవి వచ్చినా కాదననని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హైవోల్టేజ్ పంచ్‌లు
ఆహా ఓటీటీలో లిమిటెడ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి. మూడో సీజన్ లో భాగంగా తొలి ఎపిసోడ్ లో బాలకృష్ణ.. తన సినిమా భగవంత్ కేసరి యూనిట్ తోనే ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఈ షో ఎపిసోడ్ ప్రోమో హైలెట్ అయింది. దాంతో ఎపిసోడ్ లో కొత్తగా ఏం చెప్పారన్నదానిపై ఆసక్తితో ఎక్కువ మంది చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఎవరీ అడవి బిడ్డ జమ్మి?
నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’షోతో మళ్లీ బుల్లితెరపైకి వచ్చారు. ఈసారి మరింత ఎనర్జీతో లిమిటెడ్ షో నిర్వహించారు. ఈ షోకు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ మంగళవారం సాయంత్రం ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమైంది. ఈ షోలో ‘భగవంత్ కేసరి’ మూవీ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్, శ్రీలీలా, విలన్ అర్జున్ రాంపాల్ వచ్చారు. ఈ షో ఆధ్యాంతం సరదాగా సాగింది. బాలయ్య.. అనిల్, కాజల్, శ్రీలీలతో ఓ ఆట అడుకున్నారు. షో చివరిలో సామాజిక సేవ చేస్తున్న ఓ అడవి బిడ్డను సత్కరించారు. అంతేకాదు, ఆర్థిక సాయం కూడా అందించారు. ఊరి కోసం తన సొంత ఇంటికి దాచుకున్న డబ్బును సైతం ఖర్చుపెట్టి రోడ్డు వేయించిన ఆ ఆడపులి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని బాలయ్య కొనియాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్
ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ టీమ్ తమ నెక్ట్స్ మ్యాచ్ లో పటిష్ట న్యూజిలాండ్ ను ఢీకొట్టబోతోంది. ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్ లలో విజయం సాధించిన న్యూజిలాండ్ మరో విజయంపై ఫోకస్ చేస్తోంది. అక్టోబర్ 18న జరగనున్న మ్యాచ్ వరల్డ్ కప్ లో 16వ మ్యాచ్.. కాగా, చెన్నైలోని ఎంఏ చిదరంబంర స్టేడియం అఫ్గాన్, కివీస్ మ్యాచ్ కు వేదిక కానుంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా, 3 మ్యాచ్ లకుగానూ ఒక్కటి నెగ్గిన అఫ్గాన్ 6వ స్థానంలో నిలిచింది. అఫ్గాన్ పై నెగ్గితే 8 పాయింట్లతో అగ్ర స్థానం కివీస్ దే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి