మంగళగిరిలో అన్న క్యాంటిన్ ధ్వంసం
మంగళగిరిలో టౌన్ ఫ్లానింగ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానికంగా ఉన్న అన్న క్యాంటీన్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఓ టెంట్ లో నిర్వహిస్తున్న అన్న క్యాంటిన్ ను ఎటువంటి నోటీసులు లేకుండా తొలగింపునకు పాల్పడ్డారు. దీన్ని అన్నా క్యాంటిన్ నిర్వహకులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. రేపటి నుంచి అన్న క్యాంటిన్ పెట్టడానికి వీలు లేదు అంటూ హుకుం జారీ చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలి కానీ పేదలకి అన్నం పెట్టే క్యాంటీన్ టెంట్, సామాగ్రిని ధ్వంసం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నించారు. ఇంకా చదవండి
ఏపీ కాంగ్రెస్ రాతను రేవంత్ రెడ్డి మారుస్తారా?
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడింది. పదేళ్లపాటు అధికారానికి, ప్రజలకు దూరమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంచెం పుంజుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అది సీట్ల దాకా వెళ్తుందని ఎవరూ చెప్పడం లేదు. కాకపోతే గతంలో ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఎంత పెంచుకుంటందనేదాన్ని బట్టే కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పీసీసీ చీఫ్ షర్మిల కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పదహారో తేదీన విశాఖలో బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఇంకా చదవండి
కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనం ఎందుకు?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS Mlc Kavitha) ఈడీ అరెస్టు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఇది ఎన్నికల స్టంట్ అంటూ ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తన కుమార్తె కవిత అరెస్టుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజాపాలనకు వంద రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఇంకా చదవండి
పాలనలో సెంచరీ కొట్టిన రేవంత్
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం వందరోజుల పాలన పూర్తి చేసుకుంది. డిసెంబర్ 7 సీఎంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజే ప్రగతి భవన్ వద్ద ఉన్న గేట్లను తొలగించారు. అక్కడ ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీగా జనం రావడంతో దీన్ని జిల్లాలకు విస్తరించారు. జిల్లాల్లో సమస్యలు పరిష్కారం కాని వాళ్లు ఇక్కడకు వచ్చి వినతులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. అంతేనా ప్రగతి భవన్‌కు జ్యోతిరావ్‌పూలే భవన్‌గా నామకరణం చేశారు. అక్కడే భట్టివిక్రమార్క(Bhatti Vikramarka)కు అధికారిక నివాస భవనాలు కేటాయించారు. అక్కడి నుంచి మొదలైన సంచలన నిర్ణయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా చదవండి
ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. పోలింగ్ వివరాలు వెల్లడించింది. సీఈసీ రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్‌ని వెల్లడించారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్నట్టు ఈసీ వెల్లడించింది. ఏప్రిల్ 19న తొలి విడత లోక్‌సభ పోలింగ్ మొదలవుతుంది. ఇంకా చదవండి
ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
17వ లోక్‌సభ కాలపరిమితి ఈ జూన్ 16వ తేదీతో ముగియనుంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల తేదీలను ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. దాంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని సీఈసీ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు. ఇంకా చదవండి
పేటీఎం ఫాస్టాగ్‌ను ఎలా క్లోజ్ చేయాలి
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన గడువు ఈ నెల 15తో ముగిసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) జారీ చేసిన ఫాస్టాగ్‌ను మీరు ఉపయోగిస్తుంటే, అందులో బ్యాలెన్స్ యాడ్ చేసే డెడ్ లైన్ క్లోజ్ అయింది. ఒకవేళ ఆ ఫాస్టాగ్‌లో ఇప్పటికే బ్యాలెన్స్ లేకపోతే దానిని క్లోజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇంకా చదవండి
‘సరిపోదా శనివారం’ అప్డేట్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘జెంటిల్ మ్యాన్’ తర్వాత వీరిద్దరూ జోడీగా నటిస్తున్న చిత్రమిది. దర్శక నటుడు ఎస్.జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పటిలాగే ఈరోజు శనివారం మేకర్స్ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ అందించారు. ఇంకా చదవండి
మంచు విష్ణు కీలక నిర్ణయం
మంచు విష్ణు స్వీయ నిర్మిస్తూ.. నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది ఈ మూవీ. థాయ్‌లాండ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటివల మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీనిపై మంచు విష్ణు స్పందించి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంకా చదవండి
విరామం తర్వాత వచ్చే కోహ్లీ, మరింత ప్రమాదకరం: కైఫ్
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్((IPL) తొలి దశ మ్యాచ్‌లకు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్(CSK)అమితీమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్(Mohammad Kaif)… కోహ్లీ( Virat Kohli) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని.. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడని గుర్తు చేశాడు. ఇంకా చదవండి
మరిన్ని చూడండి
Source link