Latest NewsTelangana

Todays top ten news at Telangana Andhra Pradesh 18 february 2024 latest news | Top Headlines Today: హింసాత్మక ఎన్నికలను కోరుకుంటున్నారా?; మేడారం జాతరపై స్పెషల్ ఫోకస్


వైసీపీ అధినేత హింసాత్మక ఎన్నికలను కోరుకుంటున్నారా ?

వైఎస్ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్ రెండో సారి గెలిచేందుకు ఎన్నికల ప్రచార వ్యూహం భిన్నంగా ఉంది. సిద్ధం అనే పేరుతో క్యాంపెయిన్ ప్రారంభించి యుద్ధానికి సిద్ధం కావాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. చొక్కాలు మడత పెట్టే సమయం వచ్చిందని .. మీరే నా సైన్యమని వాలంటీర్ల సభలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్  ఇస్తున్న పిలుపులు.. ఆయన ప్రచార వ్యూహం చూస్తూంటే.. ఎన్నికల యుద్ధం పేరుతో క్యాడర్ ను రెచ్చగొడుతన్నారని.. హింసాత్మక ఎన్నికలకు ప్రిపేర్ చేస్తున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి అంతకంతకూ పెరుగుతున్నాయి. దానికి తగ్గ పరిణామాలు ఒకటొకరిగా వెలుగులోకి వస్తూండటంతో.. వైసీపీ వ్యూహం భయపెట్టి ఎన్నిక్లోల గెలవడం అనేనని.. మీరు చొక్కాలు మడతేస్తే మేం కుర్చీ మడతపెడతామని విపక్షాలు అంటున్నాయి. ఇంకా చదవండి

వైభవంగా షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. దివంగత నేత వైఎస్సార్ మనవడు, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ (Jodhpur)లోని ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy), అట్లూరి ప్రియ (Atluri Priya)ల వివాహం వైభవంగా జరిగింది. ఇరుకుటుంబాల సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుమారుడు రాజా రెడ్డి, కోడలు ప్రియకు షర్మిల కంగ్రాట్స్ చెప్పారు. ఇంకా చదవండి

రాప్తాడులో ఏపీ సీఎం జగన్ సిద్ధం సభ- ఆ వాహనాలపై ఎస్పీ ట్రాఫిక్ ఆంక్షలు

అనంతపురం జిల్లా : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభను అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే సీఎం జగన్ సిద్ధం సభ నిర్వహణ కారణంగా వాహనాల మళ్లింపు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. భారీ గూడ్స్ వాహనాలకు మాత్రమే మళ్లింపు ఆంక్షలు విధించినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆదివారం మధ్యహ్నాం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే మళ్లింపు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. అత్యవసర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, కార్లు, తదితర మిగితా అన్ని రకాల వాహనాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు… బెంగుళూరు నుండీ హైదరాబాదుకు వయా అనంతపురం మీదుగా హైవే-44 పై వెళ్లవచ్చునని వివరించారు. ఇంకా చదవండి

హరీష్‌ వర్శెస్‌ మంత్రులు- శ్వేతపత్రంపై అసెంబ్లీలో హోరాహోరీ

తెలంగాణలో వారం పదిరోజులుగా కాగుతున్న నీళ్ల పంచాయితీ ఇంకా చల్లారలేదు. అసెంబ్లీ లోపల బయట దీనిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నిస్తుంటే.. గత ప్రభుత్వ హయంలో ఇన్ని అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కారు ప్రజల ముందు రిపోర్టులు పెడుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎసస్ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా నేడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇవాళ ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టారు. దీని కారణంగా మరోసారి ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా మాటల తూటాలు పేలాయి. ఇంకా చదవండి

మేడారం జాతరపై మంత్రి సీతక్క స్పెషల్ ఫోకస్- మెడికల్ క్యాంపులు, భక్తులకు సౌకర్యాలపై సమీక్ష

తాడ్వాయి: మేడారం జాతరలో భక్తులకు విస్తృత వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కోటి మందికిపైగా తరలివచ్చే మేడారం (Medaram Jatara 2024)లో భక్తుల వైద్య సేవలు అందించడంతోపాటు జాతర్లకు తరలివచ్చే భక్తులు ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టే అంశాలపై మంత్రి సీతక్క మేడారంలోని హరిత హోటల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీ క్రిస్టియన్ హెల్త్ డైరెక్టర్ కర్ణన్, ఐటీడీఏ పీవో, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు. ఇంకా చదవండి

లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి – సీఈసీ

 మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అటు ఎన్నికల సంఘం కూడా ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ కీలక విషయాలు వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. ఇంకా చదవండి

ఫాస్టాగ్‌ నుంచి పేటీఎం ఔట్‌

వరుస దెబ్బలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు (PPBL), రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కాస్త ఊరటనిచ్చింది. డిపాజిట్ల స్వీకరణ, వాలెట్లు, ఫాస్టాగ్‌ వంటి టాప్‌అప్స్‌ విషయంలో మరో 15 రోజుల గడువు ఇచ్చింది. ఖాతాదార్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, గతంలోని గడువును 29 ఫిబ్రవరి 2024 నుంచి 15 మార్చి 2024 వరకు పొడిగించింది. ఈ గడువులోగా నగదు స్వీకరించవచ్చు, టాప్‌అప్‌ చేసుకోవచ్చు. బ్యాలెన్స్‌ను ఖాళీ చేసేందుకు, మార్చి 15 తర్వాత కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే, మార్చి 15 తర్వాత కొత్తగా నగదు స్వీకరణ, టాప్‌అప్‌లకు అనుమతి ఉండదు. సేవింగ్స్‌ అకౌంట్‌, కరెంట్‌ అకౌంట్‌, ఆటో డెబిట్‌, ఫాస్టాగ్‌, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌కు (NCMC) కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా  చదవండి

కిరాణ షాపుకు వెళ్లిన పాన్‌ ఇండియా స్టార్‌ యష్‌

సెలబ్రిటీల లైఫ్‌ అంటే సామాన్య ప్రజలకు సెలబ్రిటీల లైఫ్‌ ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. వారు వాడే బ్రాండ్స్‌ నుంచి వారు తిని ఫుడ్‌ వరకు ప్రతి దానిపై ఫోకస్‌ పెడుతుంటారు. ఈక్రమంలో వారు ఏం చేసిన అది చర్చనీయాంశం అవుతుంది. ఇక సెలబ్రిటీలు సాధారణం బయట ఎక్కడైన కనిపించారంటే ఇంకా అక్కడ ప్రజలు గుమికూడుతారు. వారిని తమ సెల్‌ఫోన్లో బంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ హీరో రాకింగ్‌ స్టార్‌ యష్‌ చర్చనీయాంశం అయ్యాడు. భార్య కోసం అతడు చేసిన పనికి అంతా షాక్‌ అవుతున్నారు. భార్య కోరిక తీర్చడం కోసం అతడు సాధారణ కిరాణ కొట్టుకు వెళ్లాడు. ఇంకా చదవండి

‘పుష్ప: ది రైజ్‌’ మూవీకి మరో అరుదైన గౌరవం

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌, ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంటర్నేషనల్‌ వేదికపై పుష్ప: ది రైజ్‌ మూవీకి దక్కిన అరుదైన గౌరవమే. అల్లు అర్జున్‌ – క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన పుష్ప: ది రైజ్‌ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బన్నీ నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు. అంతేకాదు ఈ మూవీకి గానూ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. నేషనల్‌ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడిగా బన్నీ రికార్డు స్రష్టించాడు. ఇక రీసెంట్‌గా అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంకా చదవండి

దేశవాళీలో ఆడకపోతే అంతే, క్రికెటర్లకు జై షా తీవ్ర హెచ్చరికలు

టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా(BCCI secretary Jay Shah)… తీవ్ర హెచ్చరికలు చేశాడు. గాయమైతే తప్ప.. రంజీ ట్రోఫీ లేదా ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడకపోతే  తీవ్ర పర్యవసనాలు ఉంటాయని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లను, భారత్‌-ఏ స్థాయి ఆటగాళ్లను జై షా హెచ్చరించాడు. ఈ మేరకు క్రికెటర్లకు అతడు లేఖ రాశాడు. జాతీయ జట్టులోకి ఎంపికకు దేశవాళీ క్రికెట్‌ ముఖ్యమైన కొలబద్ద అని షా స్పష్టం చేశాడు. ఇంకా చదవండి

 

 



Source link

Related posts

Telangana BJP Chief Kishan Reddy Comments On Group 1 Cancellation | Kishan Reddy: నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం

Oknews

telangana government plan to release mega dsc notification February 29 or March 1

Oknews

ఇదేం పాట చరణ్..అందుకేనా నువ్వు గ్లోబల్ స్టార్ అయ్యింది 

Oknews

Leave a Comment