Sports

Top 10 Facts About ICC World Cup 2023


World Cup 2023: ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఎక్కువ సమయం లేదు. ఈ టోర్నమెంట్ మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రారంభం అవుతుంది. వన్డే ప్రపంచకప్‌లో ఇది 13వ ఎడిషన్‌. భారత్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ వివిధ నగరాల్లోని 10 స్టేడియాల్లో జరగనుంది. ఈ ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి?
ఈసారి ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.

ఎన్ని మ్యాచ్‌లు ఆడతారు, ఫార్మాట్ ఏమిటి?
ఈ ప్రపంచకప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ దశలో ఒక జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌ల తర్వాత ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

మ్యాచ్‌లు ఎప్పుడు, ఎంతకాలం ఆడతారు?
ప్రపంచకప్‌ మ్యాచ్‌లు అక్టోబర్‌ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఫైనల్‌ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన జరగనుంది. మొత్తం 46 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. అన్ని మ్యాచ్‌లకు రెండు సమయాలను నిర్ణయించారు. డే మ్యాచ్‌లు ఉదయం 10.30 గంటలకు, డే అండ్ నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతాయి.

మ్యాచ్‌లు ఏ వేదికల్లో జరుగుతాయి?
భారతదేశంలోని 10 నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. వీటిలో అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల నగరాలు ఉన్నాయి.

లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ఎక్కడ చూడాలి?
ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా స్ట్రీమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో టీవీలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.

రిజర్వ్ డేస్ కూడా ఉన్నాయా?
సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంది. రిజర్వ్ డేస్ మ్యాచ్ షెడ్యూల్ అయిన తేదీ తర్వాత రోజు ఉంటాయి.

ఈసారి తేడా ఏమిటి?
గత ప్రపంచకప్‌ల కంటే ఈ ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొదటి రెండు ప్రపంచకప్‌లు గెలిచిన వెస్టిండీస్ జట్టు ఈసారి ప్రపంచకప్‌లో భాగం కాకపోవడం అతిపెద్ద విషాదం. విండీస్ జట్టు ఈసారి ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.

సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు ఎక్కడ ఆడతారు?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతాయి.

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఈ గొప్ప మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

ఈసారి హోస్ట్ చేయడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఒంటరిగా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. గతంలో 1987, 1996, 2011లో దక్షిణాసియా దేశాలతో కలిసి భారత్‌ సంయుక్తంగా ప్రపంచకప్‌ను నిర్వహించింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Related posts

Virat Kohli | Royal Challengers Bengaluru vs Punjab Kings |Dinesh Karthik | Virat Kohli | Royal Challengers Bengaluru vs Punjab Kings |Dinesh Karthik

Oknews

Rohit Sharma Opens Up On Retirement Plans He Wants Win World Cup

Oknews

indian cricket team on this day won odi world cup 2011 after 28 years in ms dhoni captaincy | World Cup 2011: 2011 వన్డే వరల్డ్‌ కప్‌ విజయానికి 13 ఏళ్లు

Oknews

Leave a Comment