ByGanesh
Fri 09th Feb 2024 01:17 PM
తెలుగు బిడ్డ, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును దేశ అత్యున్నత పురస్కారం వరించింది. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు కాంగ్రెస్ హయాంలో ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన అమలు చేసిన ఆర్థిక సంస్కరణల వల్ల నేడు దేశంలో అభివృద్ధి జరిగిందని ఆర్థిక నిపుణులు మాత్రమే కాదు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తాయి.
పీవీ తో పాటుగా మరో ముగ్గురికి…మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రీసెంట్ గానే బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ, బీహార్ కు చెందిన కర్పూరీ ఠాగూర్ కి కూడా భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న ప్రకటించినట్టయింది. ఇప్పుడు పార్టీలకి, రాజకీయాలకి అతీతంగా పీవీ కి భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా పీవీ నరసింహారావు మన తెలుగు జాతికి చెందినవారు కావడం గర్వించదగ్గ విషయం.
Top Honor to former PM PV.Narasimha Rao:
Bharat Ratna to PV Narasimha Rao