Telugu News Today: ‘అండగా నిలిచి అధికారంలోకి తెచ్చినా కృతజ్ఞత లేదు’ – ప్రజలకు మేలు కోసమే పుట్టింటికి వచ్చానన్న షర్మిల
తాను ఏపీ ప్రజలకు మేలు చేయడం కోసమే తన పుట్టింటికి వచ్చానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharimila) అన్నారు. తిరుపతి (Tirupati) జిల్లాలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నేతలు పల్లం రాజు, రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై వేసుకుని పాదయాత్ర చేశానని.. అండగా నిలబడి అధికారంలోకి తెచ్చినా, ఈ రోజు కనీసం కృతజ్ఞత లేదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పార్ట్ టైంగా రాజకీయాలు చేయలేను – అందుకే పూర్తిగా తప్పుకుంటున్నా – గల్లా జయదేవ్
గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే గల్లా జయదేవ్ కుటుంబం ప్రకటన చేసింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడైన గల్లా జయదేవ్.. రాజకీయాల్లోకి వచ్చి.. 2014, 2019లో రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన కేసీఆర్ – గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆ రోజునే గులాబీ బాస్ ప్రమాణం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) త్వరలోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుంటి ఎముక గాయం నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫామ్ హౌస్ లో గాయపడిన కేసీఆర్ కు వైద్యులు సర్జరీ నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు గత 2 నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు చేతి కర్ర సాయంతో నెమ్మదిగా నడుస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో గజ్వేల్ (Gajwel) నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుటికీ గాయం కారణంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఇద్దరివీ సర్కార్ కొలువులే! ఒకరికి ఛీత్కారాలు, మరొకరికి జనం గుండెల్లో స్థానం – రెండూ ఒకేసారి!
ప్రభుత్వ ఉద్యోగం వస్తే కాలుమీద కాలేసుకొని బతకొచ్చనేది చాలా మంది భావన. అందుకే సర్కారీ కొలువు కోసం విపరీతంగా శ్రమిస్తుంటారు. ఉద్యోగం పొందినవారు సక్రమంగా చేసుకుంటే.. మరికొందరు అడ్డదారుల్లో లంచాలకు అలవాటు పడి అక్రమంగా సంపాదిస్తుంటారు. అలా లెక్కకు మించి అక్రమార్జనతో దొరికిపోయిన ప్రభుత్వ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు. ఆదాయానికి వందల రెట్లు అధికంగా ఆస్తులు సంపాదించిన తీరు చూసి మనం విస్తుపోయాం. కానీ, అదే ప్రభుత్వ ఉద్యోగం కోసం తన సొంత ఆస్తులను త్యాగం చేసిన వారు మాత్రం ఇప్పటిదాకా చూడలేదనే చెప్పుకోవాలి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వచ్చే ఎన్నికలపై షర్మిల ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? ఫేస్ టూ ఫేస్‌లో జేసీ కీలక వ్యాఖ్యలు
జేసీ కుటుంబం నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా, జేసీ పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయబోతున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. అడగందే అమ్మయినా పెట్టదని.. అందుకే దీనిగురించి ఒక మాట చంద్రబాబును అడిగేసి వచ్చానని అన్నారు. చంద్రబాబు నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. కుటుంబానికి ఒకటే టికెట్ అని కూడా అంటున్నారని.. కానీ జేసీ కుటుంబానికి కూడా ఒకటే సీట్ అంటే ఎలా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి