Telugu News Today: IRR కేసులో చంద్రబాబుకు ఊరట – బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ
టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) భారీ ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో (IRR Case) చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు (AP HighCourt) చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు – కేటీఆర్, హరీష్ ఎన్నికనూ సవాల్ చేసిన ప్రత్యర్థులు
గత నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన 24 మంది అభ్యర్థుల ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్లు దాఖలయ్యాయి. వారి ఎన్నిక చెల్లదని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి.. తమను ఎమ్మెల్యేలుగా ప్రకటించాలని మరికొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్ రావు (HarishRao) ఎన్నికను సైతం సవాల్ చేశారు. అయితే, నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపే ఆ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సాక్షి మీడియాలో వాటా ఉంది- పుట్టిన గడ్డ నుంచి డోస్ పెంచిన షర్మిల
రోజుకో బాంబు పేలుస్తూ వైసీపీకి సమస్యగా మారిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరో బాణం వదిలారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ మీడియా అయిన సాక్షిలో తనకూ భాగం ఉందంటూ ప్రకటించారు. తనపై రోజుకో జోకర్‌ను తీసుకొచ్చి విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎన్ని నిందలు వేసినా తాను మాత్రం వైఎస్ షర్మిలా రెడ్డినే అన్నారు. తెలంగాణలో తనతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుందని… తనపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారన్నారు షర్మిల. అదే సాక్షి సంస్థలో తనకూ భాగం ఉందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ను కలిసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. తాము ఇది వరకే లేఖలో రాసిన విధంగా 4 వారాల సమయం కోరినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్ కు విన్నవించినట్లు చెప్పారు. తాము పార్టీ నియమాలు ఉల్లంఘించినట్లు వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిందిగా సభాపతిని, అసెంబ్లీ కార్యదర్శిని కోరామని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కు షాక్ – కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం, ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ (Daggubati Venkatesh) కు నాంపల్లి కోర్టు (Nampally Court) సోమవారం షాక్ ఇచ్చింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ హోటల్ కూల్చివేత కేసుకు సంబంధించి వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చేశారని నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రూ.కోట్ల విలువైన భవనాన్ని కూల్చేసి, ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి