Latest NewsTelangana

Top Telugu News From Andhra Pradesh Telangana Today 30 January 2024


Telugu News Today: సిద్ధం – సంసిద్ధం – మేమూ సిద్ధం ! ఆంధ్రలో రాజకీయ పార్టీల స్లోగన్లు రెడీ – ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజకీయ పార్టీలను కుదురుగా ఉండనీయండ లేదు. తాను సిద్ధమని సీఎం జగన్  మోహన్ రెడ్డి ఫోటోతో సినిమా పోస్టర్ల మాదిరిగా రాష్ట్రం అంతా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోంది. జగన్ ప్రచార సభకు సిద్ధం అనే పేరు ఖరారు చేశారు. దీంతో టీడీపీ నేతలు , జనసేన పార్టీ నేతలు కౌంటర్ రాజకీయాలు ప్రారంభించారు.  తెలుగుదేశంపార్టీ తాము  సంసిద్ధం అని పోస్టర్లు రెడీ చేసి సోషల్ మీడియాలో వదిలింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 2న ఢిల్లీలో షర్మిల ధర్నా- హాజరుకానున్న రాహుల్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదా తెరపైకి వచ్చింది. అధికార ప్రతిపక్షాలు దీన్ని పెద్దగా పెట్టించుకోకపోయినా కాంగ్రెస్ దీన్ని హైలెట్ చేస్తోంది. పదేళ్లుగా ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీతో కుమ్మక్కై అన్ని పార్టీలు పక్కన పెట్టేశాయని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను ఇస్తామని అంటున్నారు. ప్రత్యేక హోదాను ప్రజల్లోకి మరోసారి తీసుకెళ్లేందుకు షర్మిల బహిరంగ సభల్లో చెప్పడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వేదికగా పోరాటాలు చేయనున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ, పార్లమెంట్ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారా ?
తెలంగాణలో కాంగ్రెస్ కొలువు తీరి దాదాపు రెండు నెలలు కావస్తోంది. పార్లమెంట్ ఎన్నికల కోసం మరోసారి కాంగ్రెస్,  బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. సీఎంగా రెండు నెలలు పూర్తి చేసుకోనున్న రేవంత్ రెడ్డి మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సారధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో సమావేశమై సమీక్షలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి క్యాడర్ ను బయటకు తెచ్చి, వారిలో స్ఫూర్తి నింపే బాధ్యతలను కేటీఆర్, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావులు భుజాన ఎత్తుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆ మంత్రేనా! వైసీపీలో ఐదో జాబితాపై ఉత్కంఠ
అనకాపల్లి ఎంపీ స్థానంపై వైసీపీలో తర్జనబర్జన కొనసాగుతోంది. ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై వైసీపీ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మొన్నటి వరకు యలమంచి మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, విశాఖ డెయిరీ సంస్థ వ్యవస్థాపకులు ఆడారి తులసీరావు కుమార్తె రమాకుమారి పేరును తెరపైకి తీసుకువచ్చిన వైసీపీ అధిష్టానం.. తాజాగా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

నిర్మల సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగాన్ని లైవ్‌లో ఎప్పుడు, ఎలా చూడాలి?
భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 01 ఫిబ్రవరి 2024న గురువారం నాడు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్‌ డే దగ్గర పడడంతో దేశం అంతటా ఆర్థిక చర్చలు జరుగుతున్నాయి. నిర్మలమ్మ తీసుకొచ్చేది ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌’ (Vote-on-Account Budget) కాబట్టి, ఈ పద్దులో పెద్ద మార్పులు-చేర్పులు ఉండకపోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల ‍‌(2024 General Election) తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం, జులై నెలలో సమగ్ర బడ్జెట్‌ను విడుదల చేస్తుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



Source link

Related posts

TS Teachers Promotions Issue: కోర్టు వివాదంతో టీచర్స్ ప్రమోషన్స్‌కు బ్రేకులు

Oknews

HMDA Ex Director: తవ్వేకొద్దీ ఆస్తులు, వందల కోట్లు పోగేసిన శివబాలకృష్ణ

Oknews

“సమ్మక్క సారలమ్మకు ప్రణమిల్లుదామని” ప్రధాని మోదీ పిలుపు.. ఎక్స్‌లో శుభాకాంక్షలు…-prime minister narendra modi wishes on the eve of medaram tribal fair ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment