Telugu News Today: ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలు- తమిళిసై రాజీనామా ఆమోదం
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముం ఆమోదించారు. అనంతరం తెలంగాణ కొత్త గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించే వరకు తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే పేరుకే ముఖ్యమంత్రి – అధికారాలు నిల్ ! ఆపద్ధర్మ సీఎం ఏం చేయవచ్చు ?
నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పని చేశా.. ఇక కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ్టి నుంచి పీసీసీ అధ్యక్షునిగా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. నిజానికి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావు. అయినా రేవంత్ రెడ్డి అలా అనడానికి కారణం.. ఎన్నికల కోడ్ అంత పవర్ ఫుల్ కావడమే. మఖ్యమంత్రి అయినప్పటికీ .. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ఆపద్ధర్మ సీఎంలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్ అస్త్ర
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే అన్ని వ్యవస్థలు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లిపోతాయి. ఎక్కడైనా అధికార పార్టీకి వ్యవస్థలు అనుకూలంగా ఉండకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించేలా చేస్తుంది ఈసీ. ఈ క్రమంలోనే ప్రజలకి కూడా కొన్ని అధికారాలు ఇస్తోంది ఎన్నికల సంఘం. మీ ప్రాంతాల్లో అక్రమాలు జరిగినా అధికార దుర్వినియోగం కానీ, లేదా డబ్బుల పంపిణీ, ఇతర ప్రలోభాలు జరిగినా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావచ్చు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తీహార్ జైలుకు స్వాగతం – కవితకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ !
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన కవితకు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఓ లేఖ రాశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్షసాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలేనని కవిత అరెస్టుతో తేలిందని అన్నారు. నిజం బయటికొచ్చిందని.. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడూ వెంటాడుతోందని అన్నారు. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమి చేయలేరని అనుకునేవారు. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైందని లేఖలో చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల – పూర్తి లిస్ట్ ఇదేనా!
2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాసేపట్లో విడుదల చేయనున్నారు. 25 పార్లమెంట్ స్థానాలకు 17 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. మిగిలిన స్థానాల్లో బీజేపీ జనసేన పోటీ పడనున్నాయి. ఆరు స్థానాలు బీజేపీకి కేటాయించగా… రెండు జనసేనకు ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మరిన్ని చూడండి