Latest NewsTelangana

training for SCTPCs TSSP shall commence from April 1 in all the Battalion Training Centres


TS Constable Training: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్(TSSP Constable) కానిస్టేబుళ్ల శిక్షణ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. 4,250 మంది కానిస్టేబుళ్లకు బెటాలియన్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణా విభాగం అదనపు డీజీపీ అభిలాష బిస్త్ మార్చి 23న ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణార్థులకు కేటాయించిన కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో తగినంతగా మైదానాలు, వసతి సదుపాయాలు లేకపోవడంతో శిక్షణను వాయిదా వేశారు. ప్రస్తుతం అవి సమకూరడంతో శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించారు.

శిక్షణకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
TSSP Constable Training: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, ఏప్రిల్‌ 1 నుంచి 'స్పెషల్ పోలీస్' శిక్షణ ప్రారంభం

తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు.

అయితే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11 వేల మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీఎస్‌ఎస్‌పీ విభాగానికి చెందిన కానిస్టేబుళ్లకు తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన వారికి శిక్షణ ప్రారంభించారు. అయితే టీఎస్‌ఎస్‌పీ విభాగం కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో శిక్షణను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శిక్షణకు అనువైన మైదానాలతో పాటు శిక్షణార్థుల బసకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. మరికొద్ది రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు అదనపు డీజీపీ అభిలాషబిస్త్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో మొత్తం 16,604 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ కాగా.. 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో 5,010 పోస్టులు టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇందులో నుంచి 4250 మంది అభ్యర్థులు శిక్షణకు ఎంపికయ్యారు.

తెలంగాణలో కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు గతేడాది మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం, నేరచరిత్ర గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను పోలీసుశాఖ వెల్లడించింది. తుది ఫలితాలకు సంబంధించి ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218; ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708; ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564; ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779; ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153; ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరి నుంచి 13,444 మంది కానిస్టేబుల్ శిక్షణకు పోలీసుశాఖ ఎంపిక చేసింది.

ALSO READ:

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సులో 4,660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్ల పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకారంచుట్టింది. దీనిద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) విభాగాల్లో మొత్తం 4,660 ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో సబ్-‌ఇన్‌స్పెక్టర్(RPF SI) – 452 పోస్టులు, కానిస్టేబుల్ (RPF Constable) – 4208 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను రైల్వేశాఖ(RRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి



Source link

Related posts

TS PECET 2024 Application Process started check last date here

Oknews

పుష్ప పార్ట్-3 కూడా ఉంది.. టైటిల్ ఏంటో తెలుసా?…

Oknews

సెక్స్‌పై సుస్మిత షాకింగ్‌ కామెంట్స్‌.. ఆ విషయంలో కూతుళ్ళు పిహెచ్‌డి చేశారట!

Oknews

Leave a Comment