Latest NewsTelangana

ts eapcet and ts icet 2024 entrance exams are rescheduled due to loksabha elections | TS EAPCET: TS EAPCET, టీఎస్ ఐసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు


TS CETS: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జరగాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల్లో మారాయి. TS EAPCET, టీఎస్ ఐసెట్ పరీక్షల షెడ్యూలులో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం టీఎస్ ఎప్‌సెట్‌ పరీక్షలను మే 9 నుంచి 12 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు, ఎన్నికల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్‌ ఉండటంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి TS EAPCET తేదీలను మార్చింది.

ప్రకటించిన షెడ్యూల్‌ కంటే ముందుగానే ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఎప్‌సెట్ పరీక్షలకు సంబంధించి మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా విభాగాలకు;  మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు.

అలాగే ఐసెట్‌ పరీక్షను ఒక్క రోజు పోస్ట్‌పోన్‌ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 4, 5వ తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్‌ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్‌ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో జూన్‌ 5, 6 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Bandla Ganesh sensational comments on Roja రోజా ఐటెం రాణి: బండ్ల గణేష్

Oknews

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం-త్వరలో మాజీ మంత్రులకు నోటీసులు, తెరపైకి మరో సీనియర్ అధికారి పేరు!-hyderabad phone tapping case police ready to give notice to ex ministers ,తెలంగాణ న్యూస్

Oknews

Ustaad Bhagat Singh is here ఉస్తాద్ భగత్ సింగ్ ఊపిరి పోసాడు

Oknews

Leave a Comment