Latest NewsTelangana

TS National Means Cum Merit Scholarship Scheme (NMMSS) Examination Application Last Date Extended Up To 08-11-2023


తెలంగాణలో ‘నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌(NMMS)-2023’ పరీక్ష దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. విద్యార్థులు నవంబర్‌ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు మంగళవారం(అక్టోబరు 31) ఒక ప్రకటనలో తెలిపారు. అయితే విద్యార్థులు నవంబరు 7లోగా రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి గడువు నవంబరు 7తోనే ముగియనుందని ఆయన వెల్లడించారు. దరఖాస్తు గడువును ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. తాజాగా మరోసారి పొడిగించారు.

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు నవంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులు. రెసిడెన్షియల్‌ విధానంలో చదువుతున్నవారు మాత్రం అనర్హులు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరగనుంది.

దేశంలోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.

* నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023-24

అర్హతలు..

✦ ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది  ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. 

✦ ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.

✦ కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

దరఖాస్తు విధానం:  రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి. ప్రతి విద్యార్థికి పరీక్ష ఫీజు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు రూ.50) ఎస్‌బీఐ చలానా రూపంలో జతచేయాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష విధానం: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 

✦ మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌): ఈ పేపర్‌లో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్, క్రిటికల్‌ థింకింగ్‌ నుంచి 90ప్రశ్నలు–90 మార్కులకు ఉంటాయి.

✦ స్కాలాస్టిక్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌): ఈ పేపర్‌లోనూ 90ప్రశ్నలు –90 మార్కులకు ఉంటాయి. ఏడు, ఎనిమిది తరగతుల స్థాయిలో బోధించిన సైన్స్, సోషల్, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం: ఒక్కో పేపరుకు 90 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు.

కనీస అర్హత మార్కులు: రెండు పరీక్ష(మ్యాట్, శాట్‌)ల్లో సగటున జనరల్‌ అభ్యర్థులకు 40 శాతం (36) మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 32 శాతం (29)మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు కేటగిరీల వారీగా ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు రిజర్వేషన్‌ ప్రకారం అర్హత పొందిన విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.

స్కాలర్‌షిప్ మొత్తం: ఎంపికైనవారికి నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.

Online Application

Notification

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...



Source link

Related posts

Gold Silver Prices Today 20 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: చుక్కలు చూపిస్తున్న పసిడి

Oknews

IND Vs ENG Test Uppal Stadium 25000 Students Get Complimentary Passes With Free Food

Oknews

విలేజ్ ని దత్తత తీసుకున్న కల్కి దీపికా పదుకునే.. షాక్ అవుతున్న నెటిజన్స్

Oknews

Leave a Comment