హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Meteorological Centre Hyderabad) తాజా బులెటిన్ ప్రకారం… ఏప్రిల్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు (IMD Rain Alert)అక్కడకక్కడ కురిసే(Rains in Telangana) అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఏప్రిల్ 8వ తేదీన పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. గాలి వేగం గంటకు 30- 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఇక ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 08.30 గంటల లోపు పలు ప్రాంతాల్లో కూాడా వర్షాలు పడొచ్చని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్ల, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 10వ తేదీన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడకక్కడ కురిసే ఛాన్స్ ఉందని ఓ ప్రకటనలో వివరించింది.
Source link