Latest NewsTelangana

tspsc group1 application edit facility would be available on Commission’s website from 23rd to 27th march


TSPSC Group 1 Application Edit: తెలంగాణలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు మార్చి 16తో ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు ముగియడంతో అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు మార్చి 23 నుంచి 27 వరకు అవకాశం కల్పించారు. మార్చి 23న ఉదయం 10 గంటల నుంచి మార్చి 27న సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు మార్చుకోవచ్చు.

వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ వివరాలు ఎడిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్‌ లేదా నేరుగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోరు. సవరించిన అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పీడీఎఫ్‌ ఫార్మట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఒక్కసారి వివరాలు సవరించుకున్న తర్వాత అభ్యర్థులు క్షుణ్నంగా పరిశీలించుకోవాలి. సమర్పించిన తర్వాత మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఉండదు.  

అభ్యర్థులు తమ పేరు, పుట్టినతేదీ, జెండర్, విద్యార్హతలు, ఫోటో, సంతకం తదితర వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తుల్లో ‘Un- Employee’ స్టేటస్ నుంచి ‘Employee’ మార్పు చేసుకోవాలనుకునేవారు పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. బయోడేటాలో మార్పులు చేసుకోవాలనువారు అవసరమైన అన్ని సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు ఇవే..

➥ పేరు, పుట్టినతేదీ, జెండర్ వివరాల మార్పు కోసం – పదోతరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్

➥ కమ్యూనిటీ ఓసీ నుంచి ఇతర కేటగిరీ మార్పు కోసం – కమ్యూనిటీ సర్టిఫికేట్, బీసీ అయితే నాన్-క్రిమీలేయర్ సర్టిఫికేట్

➥ ఈడబ్ల్యూఎస్ (NO/ YES) మార్పు కోసం – ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్

➥ పీహెచ్ (NO/ YES)/ పీహెచ్ కేటగిరీ మార్పు కోసం – పీహెచ్ (సదరం) సర్టిఫికేట్

➥ ఎక్స్-సర్వీస్‌మెన్ (NO/ YES) మార్పు కోసం – ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్

➥ స్పోర్ట్స్ (NO/ YES) మార్పు కోసం – స్పోర్ట్స్ సర్టిఫికేట్

➥ ఎన్‌సీసీ (NO/ YES) మార్పు కోసం – ఎన్‌సీసీ సర్టిఫికేట్

➥ ఉద్యోగి అయితే (NO/ YES) మార్పు కోసం – సర్వీస్ సర్టిఫికేట్

➥ 1-7వ తరగతి స్టడీసర్టిఫికేట్/రెసిడెన్స్ సర్టిఫికేట్ –  స్టడీ/రెసిడెన్స్ సర్టిఫికేట్

TSPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్ - దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం, పూర్తి వివరాలివే!

TSPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్ - దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం, పూర్తి వివరాలివే!

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), 900 మార్కులకు మెయిన్ (6 పేపర్లు) పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. ఇక మెయిన్ పరీక్షలో 150 మార్కులకు జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 

గ్రూప్-1 పోస్టుల వివరాలు..























క్ర.సం పోస్టులు ఖాళీల సంఖ్య
1. డిప్యూటీ కలెక్టర్ 45
2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) 115
3. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
4. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04
5. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 07
6. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 06
7. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) 05
8. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
9. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30
10. మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2) 41
11. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/
డిస్ట్రిక్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
03
12. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్/
అసిస్టెంట్ డైరెక్టర్ (డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్)
05
13. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
14. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 05
15. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రటరీ& ట్రెజరర్ గ్రేడ్-2 20
16. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్/ అసిస్టెంట్ లెక్చరర్ (ట్రైనింగ్ కాలేజ్ అండ్ స్కూల్) 38
17. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ 41
18. మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 140
  మొత్తం ఖాళీలు 563

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి



Source link

Related posts

Affidavit Information of Janasena Candidate Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఆస్తులు అప్పులు

Oknews

TS CEO Vikas Raj: రూ.50 వేల కంటే ఎక్కువ నగదుతో వెళ్తున్నారా? ఈసీ రూల్స్ తెలుసుకోండి

Oknews

ఈ నెల 26 నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం, షెడ్యూల్ లో స్వల్ప మార్పులు-hyderabad cm kcr constituencies canvassing schedule small changes ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment