తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిబ్రవరి 26న కీలక గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను అదే రోజు రద్దు చేసిన కొద్ది గంటల సమయంలోనే కొత్తగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొత్తం 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. తాజాగా జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది.
మరిన్ని చూడండి