Latest NewsTelangana

TSPSC has released final answer key with responses of various gazetted and non gazetted categories of posts in ground water department


TSPSC Gazetted and Non- Gazetted categories Answer Key:  తెలంగాణలోని భూగర్భ జల వనరుల శాఖ(Ground Water Department)లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 12న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో గెజిటెడ్, నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి గతేడాది జులైలో  పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఫైనల్ ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 

తెలంగాణ భూగర్భజల శాఖలోని వివిధ గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ పోస్టుల గతేడాది జులై 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని ఆగస్టు 17న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై ఆగస్టు  21 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. దాదాపు 6 నెలల తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

Download Final Key and Response Sheet for CBRT Exam (GAZETTED CATEGORIES)

Download Final Key and Response Sheet for CBRT Exam (NON-GAZETTED CATEGORIES)

పోస్టుల వివరాలు..

* గెజిటెడ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 32 

1) అసిస్టెంట్ హైడ్రోమెటియోరాలజిస్ట్: 01
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (మెటియోరాలజి/ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/అప్లయిడ్ సైన్స్).
జీతం: రూ.45,960 – రూ.1,24,150.

2) అసిస్టెంట్ కెమిస్ట్: 04
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ).
జీతం: రూ.45,960 – రూ.1,24,150.

3) అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్: 06
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (జియోఫిజిక్స్).
జీతం: రూ.54,220 – రూ.1,33,630.

4) అసిస్టెంట్ హైడ్రోజియోలజిస్ట్: 16
అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్‌బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్‌షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి.
జీతం: రూ.54,220 – రూ.1,33,630.

5) అసిస్టెంట్ హైడ్రోలజిస్ట్: 05
అర్హత: డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) ఉండాలి. డిగ్రీలో జియోలజీ ఒక సబ్జెక్టుగా కచ్చితంగా చదివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నిర్వహించే ఏఎంఐఈ ఎగ్జామినేషన్‌లో సెక్షన్ ఎ, బి ఉత్తీర్ణులై ఉండాలి. 
జీతం: రూ.54,220 – రూ.1,33,630.

➨ నాన్- గెజిటెడ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 25

1) టెక్నికల్ అసిస్టెంట్ – హైడ్రోజియోలజీ: 07 పోస్టులు
అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్‌బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్‌షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి.
జీతం: రూ.51,320 – రూ.1,27,310.

2) టెక్నికల్ అసిస్టెంట్ – హైడ్రోలజీ: 05 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్). జియోలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. (లేదా) ఎంఎస్సీ (హైడ్రోలజీ) రెండేళ్ల కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ.51,320 – రూ.1,27,310.

3) టెక్నికల్ అసిస్టెంట్ – జియోఫిజిక్స్: 08 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ – జియోఫిజిక్స్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
జీతం: రూ.51,320 – రూ.1,27,310.

4) ల్యాబ్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: సైన్స్ డిగ్రీ. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
జీతం: రూ.32,810 – రూ.96,890.

5) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
అర్హత: బీఎస్సీ (జియోలజీ/మ్యాథమెటిక్స్). 
జీతం: రూ.32,810 – రూ.96,890.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి



Source link

Related posts

Dil Raju was silent సైలెంట్ గా దించేసాడు దిల్ రాజు

Oknews

వరల్డ్ కప్ దెబ్బకి వెనక్కి తగ్గిన మెగా హీరో!

Oknews

Shankar opens up about Game Changer release గేమ్ చేంజర్ రిలీజ్ పై స్పందించిన శంకర్

Oknews

Leave a Comment