Latest NewsTelangana

tspsc has released ground water department Gazetted and Non Gazetted Posts Results check here | TSPSC Results: భూగర్భ జలశాఖలో గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల


TSPSC Results: తెలంగాణలోని భూగర్భ జలవనరుల శాఖలో పలు గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి గతేడాది జులై నిర్వహించిన రాత పరీక్షలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గతేడాది జులైలో టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షలు నిర్వహించింది. ఫిబ్రవరి 12న తుది కీ విడుదల చేసిన కమిషన్.. తాజాగా అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాలను విడుదల చేసింది. అభ్యర్థులు పరీక్షలో సాధించిన మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల ర్యాంకుల జాబితాను రూపొందించినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

గెజిటెడ్ పోస్టుల ఫలితాల కోసం క్లిక్ చేయండి..

నాన్-గెజిటెడ్ పోస్టుల ఫలితాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ భూగర్భజల శాఖలోని వివిధ గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ పోస్టుల గతేడాది జులై 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని ఆగస్టు 17న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై ఆగస్టు  21 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. దాదాపు 6 నెలల తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు..

* గెజిటెడ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 32 

1) అసిస్టెంట్ హైడ్రోమెటియోరాలజిస్ట్: 01
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (మెటియోరాలజి/ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/అప్లయిడ్ సైన్స్).
జీతం: రూ.45,960 – రూ.1,24,150.

2) అసిస్టెంట్ కెమిస్ట్: 04
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ) లేదా డిగ్రీ (కెమికల్ ఇంజినీరింగ్/కెమికల్ టెక్నాలజీ).
జీతం: రూ.45,960 – రూ.1,24,150.

3) అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్: 06
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (జియోఫిజిక్స్).
జీతం: రూ.54,220 – రూ.1,33,630.

4) అసిస్టెంట్ హైడ్రోజియోలజిస్ట్: 16
అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్‌బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్‌షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి.
జీతం: రూ.54,220 – రూ.1,33,630.

5) అసిస్టెంట్ హైడ్రోలజిస్ట్: 05
అర్హత: డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) ఉండాలి. డిగ్రీలో జియోలజీ ఒక సబ్జెక్టుగా కచ్చితంగా చదివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నిర్వహించే ఏఎంఐఈ ఎగ్జామినేషన్‌లో సెక్షన్ ఎ, బి ఉత్తీర్ణులై ఉండాలి. 
జీతం: రూ.54,220 – రూ.1,33,630.

➨ నాన్- గెజిటెడ్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 25

1) టెక్నికల్ అసిస్టెంట్ – హైడ్రోజియోలజీ: 07 పోస్టులు
అర్హత: జియోలజీ/ అప్లయిడ్ జియోలజీ/హైడ్రోజియోలజీ విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ (లేదా) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ధన్‌బాద్ నుంచి డిప్లొమా అసోసియేట్‌షిప్ (అప్లయిడ్ జియోలజీ) ఉండాలి.
జీతం: రూ.51,320 – రూ.1,27,310.

2) టెక్నికల్ అసిస్టెంట్ – హైడ్రోలజీ: 05 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్). జియోలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. (లేదా) ఎంఎస్సీ (హైడ్రోలజీ) రెండేళ్ల కోర్సు చేసి ఉండాలి.
జీతం: రూ.51,320 – రూ.1,27,310.

3) టెక్నికల్ అసిస్టెంట్ – జియోఫిజిక్స్: 08 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ/ఎంఎస్సీ(టెక్)/ఎంటెక్ – జియోఫిజిక్స్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 
జీతం: రూ.51,320 – రూ.1,27,310.

4) ల్యాబ్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: సైన్స్ డిగ్రీ. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉండాలి.
జీతం: రూ.32,810 – రూ.96,890.

5) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
అర్హత: బీఎస్సీ (జియోలజీ/మ్యాథమెటిక్స్). 
జీతం: రూ.32,810 – రూ.96,890.

ALSO READ: టీఎస్‌పీఎస్సీ ‘గ్రూప్‌-1’ ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు, ఎప్పుడంటే

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

మరిన్ని చూడండి



Source link

Related posts

Comedy is a Game Changer release date కామెడీ అయిపోయిన గేమ్ చేంజర్ రిలీజ్ డేట్

Oknews

హీరో ధనుష్ వీళ్ళ అబ్బాయే.. కోర్టు తీర్పు  

Oknews

telangana woman killed brutally in australia | Telangana Woman: ఆస్ట్రేలియాలో తెలంగాణ మహిళ దారుణ హత్య

Oknews

Leave a Comment