Latest NewsTelangana

TSPSC has released Intermediate Education Librarian Results check certificate verification schedule here


TSPSC Librarian Posts Results: తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాతపరీక్ష ద్వారా 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 5న ధ్రువ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం (మార్చి 1న) తెలిపింది. మార్చి 5న ఉదయం 10.30 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పరిశీలన ఉంటుందని పేర్కొంది. సర్టిఫికేట్ల పరిశీలనకు వచ్చే అభ్యర్థులందరూ చెక్‌లిస్టులోని పత్రాలు తీసుకురావాలని సూచించింది. పరిశీలనలో ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుంటే తదుపరి సమయం ఇవ్వబోమని కమిషన్‌ స్పష్టం చేసింది. షెడ్యూలు ప్రకారం పరిశీలనకు రాకుంటే అభ్యర్థిత్వాన్ని నియామక ప్రక్రియలో పరిశీలించబోమని వెల్లడించింది. 

సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఇవి అవసరం.. 

Non – Creamy Layer Certificate Proforma

DECLARATION BY THE UN-EMPLOYED

ATTESTATION FORM

CHECK LIST

1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.

2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ  

3) పరీక్ష హాల్‌టికెట్

4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో. 

5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి. 

6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో. 

7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).

8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.

9) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC  ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 

10) పీహెచ్ సర్టిఫికేట్ (SADERAM సర్టిఫికేట్).

11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి. 

12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి. 

13) నోటిఫికేషన్‌ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి. 

తెలంగాణలోని ఇంటర్, సాంకేతిక విద్యలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022, డిసెంబరు 31న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 71 లైబ్రేరియన్ పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పరిధిలో 40 పోస్టులు, టెక్నికల్ ఎడ్యకేషన్ పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 

TSPSC Librarian Results: లైబ్రేరియన్‌ పోస్టుల ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైంది వీరే

పోస్టుల వివరాలు..

* లైబ్రేరియన్ 

ఖాళీల సంఖ్య: 71

విభాగాల వారీగా ఖాళీలు: 

1) లైబ్రేరియన్: 40 పోస్టులు

విభాగం: అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్.

2) లైబ్రేరియన్: 31 పోస్టులు

విభాగం: అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యకేషన్.

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్ – ఎంఎల్‌ఐఎస్సీ స్థాయి): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులోనూ, పేపర్-2 ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

జీతం: 

⏩లైబ్రేరియన్ ఇంటర్మీడియట్ ఎడ్యకేషన్ పోస్టులకు రూ.54,220 – రూ.1,33,630.

⏩ లైబ్రేరియన్ టెక్నికల్ ఎడ్యకేషన్ పోస్టులకు లెవల్-9ఎ అర్హతకు రూ.56,100,  లెవల్-10 అర్హత ఉన్నవారికి రూ.57,700 ఇస్తారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి



Source link

Related posts

Is this why ChandraBabu alliance with BJP? బాబు బీజేపీతో పొత్తు అందుకేనా?

Oknews

Telangana Budget Updates Finance Minister Comments On last BRS Govt | Telangana Budget 2024 Highlights : కేటాయింపులు ఘనం- ఖర్చులు శూన్యం

Oknews

Sangareddy District : నిబంధనల ఉల్లంఘన…! 5 మైనింగ్ కంపెనీలు మూసివేత, 22 లక్షల జరిమానా

Oknews

Leave a Comment