Latest NewsTelangana

TSPSC Has Released Physiotherapist Posts Provisional List Of Candidates Picked Up For Verification Of Certificates


తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఫిజియోథెరపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల జనరల్ మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 1,339 మంది అభ్యర్థులు మెరిట్ జాబితాకు ఎంపికయ్యారు. వీరి నుంచి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేయనున్నారు. అనంతరం సెప్టెంబరు 27 నుంచి టీఎస్‌పీఎస్సీ ఆవరణలో ఉదయం 10.30 గంటల నుంచి సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.23,100- రూ.67,990 జీతం ఉంటుంది.

అభ్యర్థుల మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..

Notification



ALSO READ:

హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల తుది ‘కీ’ వెల్లడి, వెబ్‌సైట్‌లో అందుబాటులో
తెలంగాణ హార్టికల్చర్ డైరెక్టరేట్ పరిధిలో 22 హార్టికల్చర్ అధికారుల పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష తుది ఆన్సర్ కీని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ సీట్లను నుంచి కమిషన్ అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు తుది కీ చూసుకోవచ్చు. హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జూన్ 17న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రాథమిక కీని జూన్ 27న ప్రకటించింది. ఆన్సర్ కీపై జూన్ 28 నుంచి జులై 1 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం తుది కీని ఖరారు చేసింది. తాజగా అభ్యర్థుల సమాధానాల పత్రాలతోపాటు, తుది ఆన్సర్ కీని కమిషన్ వెల్లడించింది.  
ఫైనల్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..

టీఎస్‌పీఎస్సీ లైబ్రేరియన్ పోస్టుల తుది ‘కీ’ వెల్లడి, వెబ్‌సైట్‌లో అందుబాటులో
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో లైబ్రేరియన్ పోస్టులకు నిర్వహించిన సీబీఆర్‌టీ పరీక్ష తుది ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ సీట్లను నుంచి కమిషన్ అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు తుది కీ చూసుకోవచ్చు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71 పోస్టులకు మే 17న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ప్రాథమిక కీని మే 27న వెల్లడించింది. ప్రాథమిక ‘కీ’పై జూన్ 1 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని సబ్జెక్టు నిపుణుల బృందం పరిశీలించి.. తుది కీని ఖరారు చేసింది. తాజాగా అభ్యర్థుల సమాధాన పత్రాలు, తుది కీ వివరాలను కమిషన్ వెల్లడించింది.
ఫైనల్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..

టీఎస్‌పీఎస్సీ జూనియర్‌ లెక్చరర్‌ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ సెప్టెంబరు 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, సబ్జెక్టు వివరాలు నమోదుచేసి హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 29న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, హిస్టరీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్‌ 3న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. 
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

నవీన్ చంద్ర కోసం రంగంలోకి దిగిన కాజల్ అగర్వాల్!

Oknews

కాఫీ నుంచి మాఫియా వైపు.. రూటు మార్చిన శేఖర్‌ కమ్ముల!

Oknews

North audience again showing power మళ్ళీ పవర్ చూపించిన నార్త్ ఆడియన్స్

Oknews

Leave a Comment