Latest NewsTelangana

TSRTC Bus conductor attacked by woman in Hyderabad


Conductor Attacked In Hyderabad: తెలంగాణలో మహిళలకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో ఉచిత బస్సు(Free bus) ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి… బస్సుల్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సుల్లో మహిళల రద్దీ పెరిగింది.  కూర్చునేందుకు సీట్లు కాదు కదా… నిలబడేందుకు కూడా చోటు లేనంతగా బస్సులు నిండిపోతున్నాయి. దీంతో.. బస్సులో సీట్ల కోసం గొడవలు జరగుతున్నాయి. మహిళలు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటి సంఘటనలు కూడా  తరచూ ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా… బస్సు కండెక్టర్‌పైనే చేయిచేసుకుందో మహిళ. కండెక్టర్‌ చెంపలు వాయించింది. ఈ సంఘటన నిన్న (శుక్రవారం) జరిగింది.

పోలీసుల చెప్పినదాని ప్రకారం… అసలు ఏం జరిగింది…?
హైదరాబాద్‌(Hyderabad)లోని మెహిదీపట్నం(Mehdipatnam) నుంచి ఉప్పల్‌ (Uppal) వైపు వెళ్తున్న బస్సులో ఎక్కిన ప్రసన్న అనే మహిళ… డ్రైవర్‌పై దాడి చేసింది. తాను దిగాల్సిన చోట బస్సు ఆపలేదన్న కోపంతో… డైవర్‌ను కొట్టేసింది. శివరాంపల్లికి చెందిన ప్రసన్న అనే మహిళ..  మెహిదీపట్నం వైపు నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చింది. హైదర్‌గూడ కల్లు కంపౌండ్‌ ప్రాంతంలో దిగాల్సి ఉండగా… ఆమె అడిగిన చోట డ్రైవర్‌ బస్సు ఆపలేదు. దీంతో అత్తాపూర్‌లో దిగాల్సి వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు… రోడ్డు దాటి…  పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్ 122 దగ్గర నిల్చుంది. మెహిదీపట్నం నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లే మెహిదీపట్నం డిపోకు చెందిన రూటు నంబర్ 300 బస్సు ఎక్కింది. బస్సులో ఎక్కినప్పటి నుంచి ఆమె… దూషణ కొనసాగుతూనే ఉంది. ముందు ఎక్కిన  బస్సు డ్రైవర్‌… అడిగిన చోట ఆపలేదని… బస్సు డ్రైవర్లందరినీ తిడుతూనే ఉంది ఆ మహిళ. ఆమెను గమనించిన 300 నెంబర్‌ బస్సు కండెక్టర్‌ ఏం జరిగిందని అడిగారు. కోపంతో ఊగిపోతూ… ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది ఆ మహిళ.  మహిళలకు ఉచిత బస్సులు ఎందుకు నడుపుతున్నారో అర్థం కావడంలేదంటూ కండెక్టర్‌ చెంప చెల్లుమనిపించింది. దీంతో.. బస్సులోని ప్రయాణికులు ఆమెను అడ్డుకున్నారు. బస్సును.. నేరుగా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

బస్సు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోగానే… ఆ మహిళ అందరి కళ్ల కప్పి అక్కడి నుంచి పరారైంది. బాధిత కండెక్టర్‌ నరసింహ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న  వివరాలు సేకరిస్తున్నారు. ఆమె ఎక్కడ ఉంటారు..? ఎక్కడ పనిచేస్తున్నారు..? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులపై ఇదివరకే టీఎస్‌ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) ఎండీ సజ్జనార్‌ సీరియస్‌  వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే… కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

Congress Promises Failed In Karnataka, People Are Not In Condition To Trust Congress, Says MLA Jogu Ramanna

Oknews

ఎన్టీఆర్ పై వచ్చిన రూమర్ నిజమవ్వాలని కోరుకుంటున్న దర్శకుడు 

Oknews

Bhatti Vikramarka Fires On Ministers Harish Rao KTR And MLC Kavitha

Oknews

Leave a Comment