TSRTC Recruitment Notification 2024: తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఆర్టీసీ. ఇందులో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులు ఉన్నాయి. వీటిని కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 4వ తేదీన తార్నాకలోని కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్య్వూలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు… 7075009463, 8885027780 ఫోన్ నంబర్లను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Source link