Latest NewsTelangana

TSRTC MD Sajjanar alerts people about Cyber crimes


TSRTC MD Sajjanar alerts people about Cyber crimes: డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయా.. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ ఏమైనా కాల్స్ వచ్చాయా అయితే అప్రమత్తంగా ఉండాలి. స్లీపర్‌ సెల్స్‌ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు, ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌కు ఏకంగా రూ.30 లక్షల కుచ్చుటోపీ పెట్టాని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మాజీ ఐపీఎస్, టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD Sajjnar) హెచ్చరించారు.
 
‘హాలో.. మేం క్రైం బ్రాంచీ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో FedEx లో ఒక పార్శిల్‌ బుక్‌ అయింది. అందులో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్‌ ఉన్నాయి. అంతేకాదు, మీకు ఉగ్రవాద మాస్టర్‌ మైండ్‌ అయిన మహ్మద్‌తో పలు బ్యాంకుల్లో జాయింట్‌ అకౌంట్స్‌ ఉన్నాయి. మీరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు.” అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు (Cyber Criminals) ప్రజలకు ఫోన్‌ కాల్స్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పార్శిళ్లలో డ్రగ్స్‌, తీవ్రవాదులతో బ్యాంక్‌ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా నిజమైన పోలీసుల్లాగానే తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పంపించి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని మాజీ ఐపీఎస్ సజ్జనార్ వెల్లడిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.  

పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్‌ కాల్‌.. రూ.31 లక్షలు దోపిడీ 
తాజాగా ఐఐటీ హైదరాబాద్‌ పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్‌ కాల్‌ చేసి అక్షరాల రూ.31 లక్షలు నిలువు దోపిడీ చేశారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్‌ అకౌంట్‌ తీశారని, అందులో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. తన లాప్‌ టాప్‌ను, ఫోన్‌ను ఉగ్రవాదులు హ్యాక్‌ చేశారని భయపెట్టారు. ఉగ్రవాద స్లీపర్‌ సెల్స్‌ తో తన కుటుంబానికి ప్రాణహానీ ఉందని, హౌజ్ అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పి 6 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పిన వినకుండా భయభ్రాంతులకు గురిచేశారు. 

Be Alert: డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్‌, రూ.31 లక్షలు దోపిడీ! సజ్జనార్ కీలక సూచనలివే

జాయింట్ అకౌంట్‌లో అనుమానస్పద లావాదేవీలున్నాయని, వాటిని పరిశీలించాలని మాయమాటలు చెప్పారు. తన కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న రూ.31 లక్షలను తమ బ్యాంక్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తర్వాత వారు స్పందించలేదు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తనను వ్యక్తిగతంగా కలిసి మోసపోయానని వాపోయారు.  

ఇలాంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతలే. మోసాలకు గురవుతున్నారని సజ్జనార్ తెలిపారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్శిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐవీఆర్ కాల్స్ వస్తే వాటికి అసలే స్పందించవద్దు అని సూచించారు. ముఖ్యంగా అలాంటి వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు అని జాగ్రత్తలు చెప్పారు. డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దు అన్నారు. మీరు ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని… లేదా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.

 

మరిన్ని చూడండి



Source link

Related posts

ఇక ‘సీబీఐ’ వంతు…! కవిత కస్టడీకి కోర్టు అనుమతి, వెలుగులోకి కొత్త విషయాలు-delhi court remands brs leader k kavitha to cbi custody till april 15 ,తెలంగాణ న్యూస్

Oknews

మొదటి సినిమాకే పౌరాణికం.. నందమూరి బిడ్డా మజాకా!

Oknews

World Cup Matches at Uppal : ఉప్పల్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‍లు – 1500 మందితో భారీ పోలీస్ బందోబస్తు

Oknews

Leave a Comment