Latest NewsTelangana

TSRTC Runs Special Buses To Uppal Stadium Amid IND Vs ENG Test Match | IND Vs ENG Test: భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్ట్ మ్యాచ్‌ కోసం టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు


TSRTC Special Buses to Uppal Stadium: క్రికెట్ అభిమానుల‌కు తెలంగాణ ఆర్టీసీ శుభ‌వార్త అందించింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేప‌టి (జనవరి 24) నుంచి ఐదు రోజుల పాటు ఇండియా ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ జరగనున్నందున ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ లోని క్రికెట్ స్టేడియానికి బస్సులు నడుపుతామని వెల్లడించారు. ఆ బస్సుల వివరాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేవలం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి తాము 60 బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు చెప్పారు. ఈ బస్సులు ప్రతి రోజు ఉద‌యం 8 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి స్టేడియం వద్ద 7 గంట‌ల వ‌ర‌కు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయని చెప్పారు. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను  వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాల‌ని క్రికెట్ అభిమానుల‌ను సజ్జనార్ కోరారు.

‘‘క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త! ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేప‌టి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా TSRTC ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ప్రతి రోజు ఉద‌యం 8 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి స్టేడియం 7 గంట‌ల వ‌ర‌కు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయి. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాల‌ని క్రికెట్ అభిమానుల‌ను టీఎస్ఆర్టీసీ కోరుతోంది’’ అని సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.





Source link

Related posts

Kalki 2098 AD hashtag trends on X మొదలెట్టారుగా ప్రభాస్ ఫాన్స్

Oknews

జిమ్ లో ఎన్టీఆర్ తో హాట్ బ్యూటీ.. పెద్ద ప్లానే ఇది!

Oknews

3 top heroines being considered for Prabhas Sirit ప్రభాస్ సరసన కరీనా కాదా?

Oknews

Leave a Comment