Latest NewsTelangana

two new election commissioners takes charges and election commission ready to release election schedule | Election Schedule: నూతన ఎన్నికల కమిషనర్ల బాధ్యతల స్వీకరణ


Two New Election Commissioners: కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. వీరు శుక్రవారం ఉదయం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈసీ వారికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఇటీవల అరుణ్ గోయల్‌, అనూప్ చంద్ర పాండే రాజీనామాతో కమిషనర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. అనంతరం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేరళకు చెందిన జ్ఞానేశ్ కుమార్‌, పంజాబ్‌కి చెందిన సుఖ్‌భీర్ సింగ్ సంధుని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరుగురి పేర్ల పరిశీలన అనంతరం వీరిని ఎంపిక చేయగా.. వెను వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి నియామకానికి ఆమోద ముద్ర వేశారు.

ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే.?

నూతన ఈసీ కమిషనర్లు బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో ఎప్పుడైనా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రాల వారీగా సీఈసీ సమీక్షలు నిర్వహించి అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలిచ్చింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ తో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు బహిర్గతం చేసిన ఈసీ – ఏ పార్టీకి ఎంత ఆదాయమో ఇక్కడ తెలుసుకోండి

మరిన్ని చూడండి





Source link

Related posts

నాని సినిమాల కోసం ఎగబడుతున్న నెట్ ఫ్లిక్స్..!

Oknews

LSD  వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

Volunteers are firing on Jagan జగన్ పై ఫైర్ అవుతున్న వాలంటీర్లు

Oknews

Leave a Comment