Telangana

two vande bharat trains from secunderabad to visakhapatnam | Vande Bharat Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్



Vande Bharat Trains From Secunderabad To Visakha: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖకు (Visakha) మరో వందే భారత్ రైలు నడపనుంది. అలాగే, భువనేశ్వర్ – విశాఖ – భువనేశ్వర్ కు సైతం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 12న ప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలైన సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఓ వందే భారత్ రైలు నడుస్తోంది. విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ తొలి వందే భారత్ 2023, జనవరి 15న ప్రారంభమైంది. ఈ రైలు ఉదయం 5:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని తిరిగి 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ ట్రైన్ కు ప్రయాణికుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. వంద శాతం ఆక్యుపెన్సీతో రిజర్వేషన్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రూట్ లో మరో రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ 16 బోగీలతో నడుస్తుండగా.. కొత్త రైలును 8 బోగీలతో మాత్రమే నడపనున్నారు. 
కొత్త వందే భారత్ టైమింగ్స్ 
ప్రయాణికుల రద్దీ, ఆక్యుపెన్సీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలుకు రైల్వే శాఖ ఆమోదం తెలపగా.. త్వరలోనే  ఈ రైలు పట్టాలెక్కనుంది. ట్రైన్ నెంబర్ 20707/20708 సికింద్రాబాద్ – విశాఖ – సికింద్రాబాద్ రైలు గురువారం తప్ప మిగతా అన్ని రోజులూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ప్రతీ రోజూ ఉదయం 5:05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2:35 గంటలకు బయల్దేరి రాత్రి 11:20కి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం.. ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
భువనేశ్వర్ – విశాఖ – పూరీకి వందేభారత్
విశాఖ నుంచి పూరీకి వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు (20841/20842) శనివారం మినహా మిగిలిన రోజులు నడవనుంది. ప్రతి రోజూ ఉదయం 5:15 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి ఉదయం 11 గంటలకు విశాఖ వస్తుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 3:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి. 443 కిలో మీటర్ల దూరాన్ని సుమారు 5 గంటల్లోనే చేరుకుంటుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తోన్న వందేభారత్ రైలులో ఉండే ఛార్జీలే దీనికి వర్తింపచేస్తారని వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు.
భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వందేభారత్ రైలు ఖుర్దారోడ్ (ఉదయం 5:33 గంటలకు), బరంపూర్ (ఉదయం 7:05 గంటలకు), ఇచ్ఛాపురం (ఉదయం 7:18 గంటలకు), పలాస (ఉదయం 8:18 గంటలకు), శ్రీకాకుళం రోడ్ (ఉదయం 9:03 గంటలకు), విజయనగరం  (ఉదయం 09:48 గంటలకు)స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లే వందేభారత్ రైలు విశాఖలో మధ్యాహ్నం 03:45 గంటలకు బయలుదేరి 4:30 గంటలకు విజయనగరం చేరుతుంది. సాయంత్రం 5:28 గంటలకు శ్రీకాకుళం రోడ్, 6:30 గంటలకు పలాస, రాత్రి 7 గంటలకు ఇచ్ఛాపురం, 7:20 గంటలకు బరంపూర్, రాత్రి 8:57 గంటలకు ఖుర్దారోడ్, రాత్రి 9:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందని.. ప్రతీ స్టేషన్ లోనూ ఈ రైలు 2 నిమిషాలు ఆగుతుందని అధికారులు తెలిపారు.
Also Read: Daggubati Purandeswari: ‘దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే పొత్తులు’ – ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత వస్తుందన్న పురంధేశ్వరి

మరిన్ని చూడండి



Source link

Related posts

Chief Minister Revanth Reddy Reviews Over Panchayat Raj Department In Telangana Secretariat | Revanth Reddy: ఊరిలో ఆ నిర్వహణ ఇక పంచాయతీలకే, కోటి నిధులు

Oknews

Online applications are invited for the Entrance Test for admission into Degree 1st year in MJPTBCW TSW and TTW Residential Degree Colleges

Oknews

Bank Holidays List For March 2024 Banks To Remain Closed For 14 Days in March 2024 check details

Oknews

Leave a Comment