India vs New Zealand: వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup)లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే సూపర్ సిక్స్‌కు చేరిన టీమిండియా(Team India)… సూపర్ సిక్స్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్( New Zealand)ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో భారత బ్యాటర్ ముషీర్ ఖాన్(Musheer Khan)… విధ్వంసం సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో కదం తొక్కిన ముషీర్ ఖాన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ ముషీర్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీలతో 325 పరుగులు చేశాడు.
రెండు శతకాలు.. ఒక అర్ధ శతకం
అండర్ 19 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై 118 పరుగులు చేసిన ముషీర్… న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 పరుగులు చేశాడు. ఈసెంచరీలతో ముషీర్ ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేశాడు. ఇప్పుడు రెండు సెంచరీలు చేసిన ముషీర్.. శిఖర్( Shikhar Dhawan) రికార్డును సమం చేశాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు.
సోదరుడే స్ఫూర్తి అంటున్న అన్న
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ –19 వరల్డ్ కప్‌లో సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్(Musheer Khan) అద్భుత ఆటతీరుతో అలరిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెంచరీలు , మరో అర్థ సెంచరీతో జోరుమీదున్నాడు. తాను ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు సోదరుడు ముషీర్ ఖాన్ ఆటతీరును గమనిస్తానని సర్ఫరాజ్ తెలిపాడు. ముషీర్ తన కంటే మంచి బ్యాటర్ అని అన్నాడు. తన సోదరుడి టెక్నిక్‌ని గమనిస్తూ దానిని అనుకరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. తన సోదరుడి ఆటతీరు తనకు నమ్మకాన్ని ఇస్తుందని సర్ఫరాజ్ తెలిపాడు. తాను బాగా బ్యాటింగ్ చేయలేనప్పుడు ముషీర్ ఖాన్‌ని చూసి నేర్చుకుంటానని అన్నాడు. తాను స్వీప్ బాగా ఆడతానని అనుకుంటున్నానని. మా ఇద్దరి మధ్య ఎల్లప్పుడూ పోటీ ఉంటుందని సర్ఫరాజ్ తెలిపాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో సర్ఫరాజ్ ఎంతో నేర్చుకున్నాడని… అతనిపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలక్టర్లు.. అతడికి మద్దతుగా నిలిచిన అభిమానులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ ఖాన్ అన్నారు.
సిద్ధమవుతున్న టీమిండియా
ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. తొలి టెస్టులో అనూహ్య పరాజయం పాలై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ సేన… ఈ టెస్టులో గెలిచి మళ్లీ గాడిన పడాలని చూస్తోంది. రాహుల్, జడేజా గాయం కారణంగా రెండో టెస్ట్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు జట్టు కూర్పు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌలర్ అవసరం లేనపుడు మహ్మద్ సిరాజ్‌ను తప్పించి ఒక బ్యాటర్‌ను అదనంగా తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.