GossipsLatest News

Urvasi special in Vishwambhara బోర్ కొట్టేస్తుందేమో బాసు ఆలోచించండి



Mon 19th Feb 2024 12:11 PM

urvashi rautela  బోర్ కొట్టేస్తుందేమో బాసు ఆలోచించండి


Urvasi special in Vishwambhara బోర్ కొట్టేస్తుందేమో బాసు ఆలోచించండి

ఇప్పుడు ఐటెం సాంగ్స్ కి చాలామంది దర్శకనిర్మాతలు బాలీవుడ్ భామ ఊర్వశి వైపే చూస్తున్నారు. గత ఏడాది వాల్తేర్ వీరయ్యలో మెగాస్టార్ సరసన ఐటెం స్టెప్స్ వేసిన ఊర్వశి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బ్రో లోను ఆడిపాడింది. బోయపాటి స్కంద లోను స్పెషల్ డాన్స్ చేసింది. ఇక ఈ ఏడాది బాలకృష్ణ – బాబీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో ఊర్వశి రౌతేల్ల కీలక పాత్రలో కనిపించబోతుంది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ మెగాస్టార్ తో మరోసారి ఐటమ్ సాంగ్ లో ఆడబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వసిష్ఠ తో విశ్వంభర మూవీ చేస్తున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు రీసెంట్ గానే సెట్స్ లోకి వెళ్లారు. కొద్దిరోజులు షూటింగ్ చేసాక చిన్న బ్రేకిచ్చి చిరు ఆయన భార్యతో కలిసి స్నేహితుడి ఇంట్లో శుభ కార్యం కోసం అమెరికా వెళ్లారు. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే త్రిష ఒక హీరోయిన్ గా ఎంపికవడమే కాదు విశ్వంభర సెట్స్ లోకి కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు ఊర్వశి రౌతేల్ల విశ్వంభర లో ఐటెం సాంగ్ చేయబోతుంది అనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.

దానితో మెగా అభిమానులు బాసు ఊర్వశి అంటే బోర్ కొట్టేస్తుందేమో కాస్త ఆలోచించండి.. ఇప్పటికే ఆమె మీతో ఐటమ్ స్టెప్స్ వేసింది. మీ తమ్ముడితోనూ ఆడిపాడింది. మరోపక్క ఆమె ఐటెం సాంగ్స్ చేస్తుంది. అందుకే బోర్ కొట్టేస్తుంది.. ఓ కొత్త హీరోయిన్ ని తీసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.


Urvasi special in Vishwambhara:

Urvashi Rautela special in Chiranjeevi Vishwambhara









Source link

Related posts

Mancherial MLA Prem Sagar Rao counters to Balka Suman over his comments on Revanth Reddy | Mancherial News: బాల్క సుమన్‌కు త్వరలోనే తగిన శాస్తి, త్వరలో అన్నీ బయటపెడతా

Oknews

Heated Debate in Telangana Assembly Criticism of Congress and BRS

Oknews

Nani 31 Female Lead is Priyanka Mohan మరోసారి నానితో జోడి కడుతున్న ప్రియాంక

Oknews

Leave a Comment