దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్(ICC U19 World cup 2024) లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) జట్టు మరో భారత జట్టును తలపిస్తోంది. ఎందుకంటే ఈ జట్టులో ఆసియా మూలాలకు చెందిన ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. అంతే కాదు జట్టులో ఏ క్రికెటర్ కూడా అమెరికాకు చెందినవారు కారు. వారంతా ఆసియా మూలాలు ఉన్నవారు, లేకపోతే ముందు భారత పౌరసత్వం కలిగి ఉంది తరువాత అమెరికా పౌరసత్వం పొందినవారే. ఈ టీం ఫోటోని సోషల్ మీడియా లో చూసిన క్రికెట్ అభిమానులు సైతం జట్టు మొత్తం ఆసియా XI లాగా ఉందని వ్యాఖ్యానించారు. ‘ఆసియా 11 U19′ అని ఒకరు, టీమ్ ఎన్‌ఆర్‌ఐ అని మరొకరు,’ఇండియా 2.0’ అని మరొకరు కామెంట్ చేశారు.
ఇక అండర్ 19 ప్రపంచకప్ విషయానికి వస్తే 2024 జనవరిలో ప్రారంభమయిన ఈ మెగా టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు ఉంటాయి. ఫైనల్ ఫిబ్రవరిలో జరగనుంది. జనవరి 19 నుంచి తొలి దశ పోటీలు 28 వరకు తొలి రౌండ్ పోటీలు జరిగాయి. ప్రతి గ్రూపులో టాప్ -3లో ఉన్న జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుతాయి. సూపర్ సిక్స్‌లో కూడా మళ్లీ నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఈ దశలో ప్రతి గ్రూపులో టాప్ లో ఉన్న జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఫిబ్రవరి 3 దాకా ఈ పోటీలు సాగుతాయి. ఇక ఫిబ్రవరి 6, 8న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 11న బెనొనిలోని విల్లోమూర్ పార్క్ వేదికగా తుది పోరు జరుగునుంది. ఈసారి గ్రూప్ స్టేజీ తరువాత సూపర్ సిక్స్ విధానాన్ని తీసుకొస్తుంది ఐసీసీ. సూపర్ సిక్స్ మ్యాచ్ ఫలితాలతో సెమీ ఫైనల్ టీమ్స్ ను నిర్ణయిస్తారు.
భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే, అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్, మురుగన్ అభిషేక్, అవనీశ్ రావు, ఇనీశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్ దేవ్‌కర్, అన్ష్ గొసాయ్, మహ్మద్ అమన్
అంత ఎందుకు 2012లో సారధిగా టీమిండియా(Team India)కు అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup) అందించిన కెప్టెన్ ఉన్ముక్ చంద్ మీకు గుర్తున్నాడా. ఫైనల్లో సెంచరీతో కదంతొక్కి మరీ భారత్‌కు అండర్ 19 ప్రపంచకప్ అందించాడు. ఆ తర్వాత సీనియర్ జాతీయ జట్టులోకి అడుగు పెట్టకుండానే భారత క్రికెట్ నుంచి ఉన్ముక్త్ చంద్ రిటైర్ అయ్యాడు. కెప్టెన్‌గా అండర్-19 ప్రపంచకప్‌ను టీమ్ఇండియాకు అందించిన ఉన్ముక్త్ చంద్.. కేవలం 28 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. జాతీయ జట్టులో అవకాశాల కోసం ఎదురు చూసినా ఫలితం దక్కకపోవడం…. ఇదే సమయంలో అమెరికా(USA) నుంచి లీగ్‌ల్లో ఆడేందుకు ఆఫర్ రావడంతో ఉన్ముక్త్ భారత క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకొన్నాడు. అనంతరం ఉన్ముక్ చంద్ అమెరికాకు వెళ్లి అక్కడ మేజర్ లీగ్ క్రికెట్‌తో మూడేళ్లపాటు ఒప్పందం చేసుకొన్నాడు. బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో ఆడిన మొదటి భారతీయ క్రికెటర్ కూడా ఉన్ముక్త్ కావడం విశేషం.