దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు అవసరమైన వస్తువులను నేరుగా వెళ్లి మాత్రమే కొనుగోలు చేసేవారు వారు. బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా కొందరికి ఎప్పుడంటే అప్పుడు షాపింగ్ చేసే సమయం ఉండేది కాదు. కానీ ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక అలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. వివిధ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో లేదా యాప్‌లలో తమకు నచ్చిన వస్తువును ఆర్డర్ చేసుకొని వెంటనే పొందే వెసులుబాటు ఇప్పుడు ఉంది. సాధారణంగా ఏ ఏవస్తువైనా ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే రెండు మూడు రోజుల్లో ఆర్డర్ చేసిన వ్యక్తి అడ్రస్‌కు ఆ వస్తువు చేరుతుంది. కానీ ఓ వ్యక్తికి మాత్రం వింత అనుభవం ఎందురైంది. ఆర్డర్ చేసిన ఆరేండ్లకు ఆ వస్తువు రావడంతో ఆశ్చర్య పోయాడు.
ముంబైకి చెందిన ఎహసాన్ అనే వ్యక్తి ఆరేండ్ల కిందట స్పార్క్స్ స్లిప్పర్లను కొనుగోలు చేయాలనుకున్నాడు. అందుకోసం ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అయిన ఫ్లిప్‌కార్డ్‌లో మే16, 2018లో రూ. 485 ధర కలిగిన చెప్పులను బుక్ చేశాడు. సదరు చెప్పుల విక్రయదారు కంపెనీ పేరు గురూజీ ఎంటర్ ప్రైజ్ కాగా, అదే సంవత్సరం మే 19న ఆర్డర్ షిప్పింగ్ చేయబడింది. మే 20న డెలివరీ కానున్నట్లు అప్డేట్ చూయించింది. కానీ ఇచ్చిన గడువు దాటిపోయినా ఆర్డర్ డెలివరీ కాలేదు. క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా లేకపోవడంతో కస్టమర్ ఏమీ చేయలేకపోయాడు. కానీ చివరకు రెండు రోజుల క్రితం (2024) సడెన్‌గా ఎహసాన్ ఆర్డర్ చేసిన స్లిప్పర్లు అతని అడ్రస్‌కు వచ్చాయి. ఇదే విషయాన్ని అతను ఎక్స్‌వేదికగా పంచుకుంటూ ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్‌ను స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.