Sports

Virat Kohli And Anushka Sharma Expecting Their Second Child Confirms AB De Villiers


Virat Kohli and Anushka Sharma are expecting their second child:  టీమ్ఇండియా(Team India) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరోసారి తండ్రి కాబోతున్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరంగా ఉన్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ ఫ్రెండ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా యూట్యూబ్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్‌ అభిమానులతో ముచ్చటించాడు. విరాట్ కోహ్లీతో మాట్లాడారా? అతను బాగున్నారా? అని ఓ అభిమాని ఆయన్ని అడిగాడు. ‘‘ఇటీవల అతడితో చాటింగ్ చేశా. ఎలా ఉన్నావు అని అడిగా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అతను తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నా. కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు అతడు తన కుటుంబంతో ఉండటం ముఖ్యం. విరాట్ తన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చాలా మంది భావిస్తుండొచ్చు. కానీ, అది తప్పు. కోహ్లీని మేం కూడా మిస్‌ అవుతున్నాం. అతడు కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకున్నాడని డివిలియర్స్‌ అన్నాడు. 2017లో అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. 2021లో వీరికి వామిక జన్మించింది.

కోహ్లీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని కోహ్లీ సోదరుడు వికాస్‌ కొట్టిపారేశాడు. తమ తల్లి ఆరోగ్యంగానే ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ఇక, ఇంగ్లాండ్‌తో చివరి మూడు టెస్టులకు త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. ఆ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.



Source link

Related posts

Virat Kohli To MS Dhoni: దిగ్గజాలకు అయోధ్య ఆహ్వానం, సచిన్‌ నుంచి అశ్విన్‌ దాకా

Oknews

రోహిత్ ఏడిస్తే..సచిన్ గుర్తుకు వచ్చారు కోహ్లీ ఎమోషనల్ స్పీచ్..!

Oknews

India Women vs South Africa Women Test India Womens Won Match By 10 Wickets | IND-W vs SA-W: అక్కడ అబ్బాయిలు, ఇక్కడ అమ్మాయిలు గెలిచేశారు

Oknews

Leave a Comment