మూవీ : వెపన్
నటీనటులు: సత్యరాజ్, వసంత్ రవి, తన్య హోప్, రాజీవ్ మీనన్ మాయా సుందరక్రిష్ణన్ తదితరులు
ఎడిటింగ్: గోపీ కృష్ణన్
మ్యూజిక్: గిబ్రాన్
సినిమాటోగ్రఫీ: ప్రభు రాఘవ్
నిర్మాతలు: ఎమ్.ఎస్ మంజూర్
దర్శకత్వం: గుహన్ సెన్నియప్పన్
ఓటీటీ: ఆహా
బహుబలి సినిమాలో కట్టప్పగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సత్యరాజ్ నటించిన మూవీ ‘ వెపన్(Weapon ). ఈ ఏడాది తమిళ్ లో విడుదలైన వెపన్ తాజాగా తెలుగు వర్షన్ డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజైంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం..
కథ :
అగ్ని (వసంత్ రవి) ఓ యూట్యూబర్. ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుపడుతుంటాడు. ఓ రోజున తేని డిస్ట్రిక్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఓ సంస్థ దగ్గరలో బాంబు బ్లాస్ట్స్‌జరుగుతుంది. ఆ బాంబు బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో అగ్ని పోలీసులకు దొరుకుతాడు. టెర్రరిస్ట్ అనే అనుమానంతో అగ్నిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్రపంచానికి తెలియని సూపర్ హీరో మిత్రన్(సత్యరాజ్) గురించి తాను వెతుకుతున్నానని, తనకు ఈ బ్లాస్ట్‌లతో సంబంధం లేదని పోలీసులకు చెబుతాడు అగ్ని. సూపర్ హీరో మిత్రన్‌కు అగ్నికి ఉన్న సంబంధం ఏమిటి? మిత్రన్ కోసం అగ్నితో పాటు బ్లాక్ సొసైటీ అధినేత డీకే కూడా ఎందుకు వెతుకుతున్నాడు. జర్మనీ నుంచి ఇండియాకు వచ్చిన ఓ సూపర్ సీరమ్ వల్ల మిత్రన్ సూపర్ హ్యూమన్‌గా ఎలా మారాడన్నదే వెపన్ మూవీ కథ.
విశ్లేషణ:
సినిమా మొదలవ్వడమే మన చరిత్ర పుటల్లో దాగి వున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం కాన్సెప్ట్ గా ఆరంభమవుతుంది. ఇక ఆ తర్వాత అయిదు నిమిషాలు ఏం జరుగుతుందో అర్థం కాదు. కొన్ని నిమిషాల తర్వాత హాలివుడ్ రేంజ్ లో ఫైట్లు మొదలవుతాయి. అసలేం జరుగుతుందో అర్థం కాదు.
మొదటి అయిదు నిమిషాలు ఉన్నంత ఇంటెన్స్ సినిమా మొత్తం ఉండి ఉంటే ఇది సూపర్ సక్సెస్ అయ్యేది. అంతలా మొదట ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దర్శకుడు.. ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయాడు. ఇక సినిమా నలభై నిమిషాలు చూసిన తర్వాత వామ్మో ఇదేం సినిమా రా బాబు.. కనీసం హాలీవుడ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ వర్షన్ చూసుకున్న బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. సూపర్ హీరో సినిమా అంటు బిల్డప్ ఇచ్చారు కానీ ఇది సూపర్ జీరో సినిమా.. ఇక అసలు కథలోకి వెళ్తాడేమో అని చాలా జాగ్రత్తగా నలభై నిమిషాల వరకు చూసాక సహనం కోల్పోతాం. ఇక ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇష్డమొచ్చినట్టు తీసారు. డీటేలింగ్ లేదు.. ప్రాపర్ లాజిక్స్ లేవు.. ఇక ఇది సరిపోదంటు మరో పార్ట్ ఉండబోతుందంటు ఎండ్ లో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. అది చూసి మైండ్ పోతుంది నిజంగా.. ఇందులోనే ఏం లేదంటే ఇంకో పార్టా అన్నట్టుగా ఆడియన్ షాక్ అవుతాడు.
వెపన్ అనే టైటిల్ పెట్టి ఆడియన్స్ మీద వాడినట్లుగా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ ఓపిక కావాలి.. సమయం కావాలి.. లాజిక్స్ అడగ్గకూడదు.. కథనం ఏంటో అస్సలు తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. నేతాజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మంచి కథా పాయింట్ ని సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు. బ్యాడ్ స్టోరీ టెల్లింగ్ తో నస పెట్టించేశాడు. గోపీ కృష్ణన్ ఎడిటింగ్ బాగుంది. ప్రభు రాఘవన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. గిబ్రాన్ మ్యూజిక్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
మిత్రన్ గా సత్యరాజ్ నటన బాగుంది. అగ్నిగా వసంత్ రవి ఒదిగిపోయాడు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : గజిబిజి కథనంతో ఆడియన్స్ మీద వెపన్ ప్రయోగించారు. ఈ మూవీని ఒక్కసారి చూడాలన్న ఓపిక ప్లస్ సమయం రెండు కావాలి.
రేటింగ్: 2 / 5
✍️. దాసరి మల్లేశ్