Latest NewsTelangana

Weather in Telangana Andhrapradesh Hyderabad on 10 March 2024 Summer updates latest news here | Weather Latest Update: నేడు ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు – తెలంగాణ మీదుగా ద్రోణి


Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు/ ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా నమోదైంది. 61 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

Andhra Pradesh Weather: నిన్నటి తెలంగాణ నుంచి కొమరిన్ వరకు ఉన్న ద్రోణి ఈరోజు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గత మరఠ్వాడ, కర్ణాటక నుంచి సగటు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

నిన్నటి తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించింది ఉంది. నిన్నటి ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువ ఎత్తులో కనుగొన్నామని అధికారులు అంచనా వేశారు.

ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. రాయలసీమలో వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

ITR 2024 Tax Saving Tips Avoid These Mistakes While Last Minute Tax Saving Plans

Oknews

అల్లు అర్జున్ కి నిజంగానే ఆర్మీ ఉంది..అందుకే వరల్డ్ రికార్డు ఇచ్చారు

Oknews

Dil Raju loss due to Vijay Devarakonda? విజయ్ దేవరకొండ వల్ల దిల్ రాజుకి నష్టం ?

Oknews

Leave a Comment