Latest NewsTelangana

Weather in Telangana Andhrapradesh Hyderabad on 27 February 2024 Winter updates latest news here


Weather Latest News: ఈ రోజు క్రింది స్థాయిలోని గాలులు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లా్ల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. 

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో దక్షిణ, నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. 76 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

Andhra Pradesh Weather: మాల్దీవుల నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ గాలులు వీస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

‘కల్కి’ హిట్టా.. ఎవరు చెప్పారు, నన్ను ట్రోల్‌ చేసే ఫ్యాన్స్‌కి ఈ విషయం తెలుసా?

Oknews

Loksabha Elections 2024 All eyes on Karimnagar Parliament seat in Telangana | Loksabha Elections 2024: కరీంనగర్ పార్లమెంట్ సీటుపై పెరుగుతోన్న ఉత్కంఠ

Oknews

Today’s Top Ten News At Telangana Andhra Pradesh 21 January 2024 Latest News | Top Headlines Today: కేసీఆర్‌పై రేవంత్ సంచలనం; పోలవరంపై చంద్రబాబు కీలక ప్రకటన

Oknews

Leave a Comment