సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. “అనుమతి అడిగినా పోలీసులు ఇవ్వలేదు. అయినప్పటీ హీరో అల్లు అర్జున్ వచ్చారు. సాధారణంగా వచ్చింటే బహుశా ఇలా జరిగేది కాదు. కానీ రూఫ్ టాప్ కారులో అభివాదం చేసుకుంటా వచ్చాడు. దీంతో వేల మంది అభిమానులు ఒక్కసారిగా ఉప్పెనలా రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రేవతి అనే మహిళ మృతి చెందింది మరియు ఆమె కొడుకూ తీవ్రంగా గాయపడ్డాడు” అని సీఎం తెలిపారు.
Topics: