Sports

World Cup 2023: Check Out Team India Top Performers In CWC


Team India At World Cup: ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ నుంచి భారత జట్టు ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అక్టోబరు 8వ తేదీన చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మూడోసారి ప్రపంచకప్ గెలవడంపై ఆశలు పెట్టుకుంది. నిజానికి గత 10 ఏళ్లలో భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీని కూడా గెలవలేకపోయింది. ఈ కరువుకు స్వస్తి పలకాలని టీమ్ ఇండియా కోరుకుంటోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది.

అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా…
ప్రస్తుత భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో అత్యధిక పరుగులు చేశాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో 13,083 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 57.38గా ఉంది. ఇది కాకుండా విరాట్ కోహ్లీ 47 సెంచరీలు కూడా చేశాడు. అలాగే 66 సార్లు యాభై పరుగుల మార్కును దాటాడు. బౌలర్ల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు రవీంద్ర జడేజా వన్డేల్లో 204 వికెట్లు తీశాడు.

ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్
అక్టోబర్ 8: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, చెన్నై
అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ
అక్టోబర్ 14: భారత్ వర్సెస్ పాకిస్థాన్, అహ్మదాబాద్
అక్టోబర్ 19: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, పూణే
అక్టోబర్ 22: భారత్ వర్సెస్ న్యూజిలాండ్, ధర్మశాల
అక్టోబర్ 29: భారత్ వర్సెస్ ఇంగ్లండ్, లక్నో
నవంబర్ 2: భారత్ వర్సెస్ శ్రీలంక, ముంబై
నవంబర్ 5: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, కోల్‌కతా
నవంబర్ 12: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్, బెంగళూరు

ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన ఎలా ఉంది?
1975: గ్రూప్ స్టేజ్
1979: గ్రూప్ స్టేజ్
1983: ఛాంపియన్స్
1987: సెమీఫైనల్స్
1992: రౌండ్-రాబిన్ స్టేజ్
1996: సెమీఫైనల్స్
1999: సూపర్ సిక్స్
2003: రన్నరప్
2007: గ్రూప్ స్టేజ్
2011: ఛాంపియన్స్
2015: సెమీఫైనల్స్

ప్రపంచకప్‌నకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Related posts

Pakistan vs Australia : World Cup 2023 లో వింటేజ్ స్టైల్ పాకిస్థాన్ | ABP Desam

Oknews

Janasena Chief Pawan Kalyan Reacts On Cricketer Hanuma Vihari Issue

Oknews

ICC U19 Mens Cricket World Cup 2024 Team Of The Tournament Revealed

Oknews

Leave a Comment